ఆంధ్రప్రదేశ్

andhra pradesh

heavy rain: అనంతలో భారీ వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి

By

Published : Oct 24, 2021, 8:22 PM IST

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం(heavy rain) కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేర్వురు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.

heavy rain
heavy rain

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం(rain) కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అనంతపురం జిల్లా..

అనంతపురం జిల్లా( గుంతకల్లులో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరుపు లెకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు పశువుల కాపరులు మృత్యువాత పడ్డారు. మృతులు మోహన్‌లాల్ నాయక్‌, తిమ్మప్పగా గుర్తించారు. భారీ వర్షాలకు పెన్నా నది, కుశవతి నదులు నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నాయి.

చిత్తూరు జిల్లా..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉరుములు ,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాళహస్తి మండలం రెడ్డిపల్లిలో పశువుల మేపేందుకు వెళ్లిన గురు కిరణ్ (14) పిడుగుపాటుకు మృతి చెందాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో.. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియాలో మరోసారి ఉద్రిక్తత.. పొలీసులపై గిరిజనుల తిరుగుబాటు

ABOUT THE AUTHOR

...view details