ETV Bharat / state

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియాలో మరోసారి ఉద్రిక్తత.. పొలీసులపై గిరిజనుల తిరుగుబాటు

author img

By

Published : Oct 24, 2021, 6:34 PM IST

Updated : Oct 24, 2021, 7:12 PM IST

aob
aob

18:32 October 24

ఒడిశా పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియాలో మరోసారి ఉద్రిక్తత (high tension on andhra odisha borders news) నెలకొంది. ఒడిశా పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. ఒడిశా తొలగించిన ఏపీ బోర్డులను గిరిజనులు మళ్లీ పెడుతున్నారు. మరోవైపు గిరిజనులు పెడుతున్న బోర్డులను పోలీసులు తొలగిస్తున్నారు. అయితే ఏపీ గ్రామాల్లోకి రావొద్దంటూ ఒడిశా పోలీసులపై గిరిజనులు తిరగబడ్డారు.  

అసలు విషయం ఏంటంటే!

ఏపీ - ఒడిశా రాష్ట్రాల్లో సరిహద్దులో కొఠియా గ్రూప్​లో 23 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల విభజన సమయంలో తలెత్తిన వివాదం నేటికీ కొనసాగుతోంది. ఈ గ్రామాలపై ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో.. స్టేటస్ కో విధించింది. అయితే.. అభివృద్ధి పేరుతో ఈ గ్రామాల్లో ఆధిపత్యం చలాయించేందుకు ఇరు రాష్ట్రాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, పార్వతీపురం ఐడీటీఏ పీవో లక్ష్మీ 2018 జనవరిలో కొఠియాలో పర్యటించి జన్మభూమి- మాఊరు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచి ఆంధ్ర అధికారులు కొఠియాకు వెళ్తున్నారని తెలిస్తే చాలు.. ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు నిరసనలకు దిగుతున్నారు.  ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇదీ చదవండి

ఇంట్లోకి దూరి వివాహితపై అత్యాచారం- ఇద్దరు అరెస్ట్​

Last Updated :Oct 24, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.