ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖోర్ధాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

By

Published : Dec 1, 2022, 4:09 PM IST

4 Persons Died in Road Accident: రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ప్రయాణ సమయంలో అతి వేగం కారణంగా నలుగురు ప్రాణాలు విడిచారు. వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

road accident
రోడ్డు ప్రమాదం

KHORDHA ROAD ACCIDENT: ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా జంకియా పోలీసు స్టేషన్ పరిధిలోని బడాపోఖారియా సమీపంలో 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భువనేశ్వర్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details