ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోరు పనిచేయక మూడేళ్లు.. వ్యవసాయ బావుల నుంచే తాగునీళ్లు తెచ్చుకుంటున్నారు!

By

Published : Apr 1, 2022, 4:27 PM IST

Water problem: చిలమత్తూరు మండలం ఎస్‌.ముదిరెడ్డిపల్లి గ్రామస్థులు మూడేళ్లుగా తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న బోరుకు మరమ్మతులు చేయకుండా అధికారులు వదిలేశారు.. దీంతో.. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది.

water problem
మూడేళ్లుగా తాగునీటి కష్టాలు

Water problem: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఎస్‌.ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. గడిచిన మూడు సంవత్సరాలుగా గ్రామస్థులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో.. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ప్రాణాలను ఫణంగా పెట్టి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊళ్లో ఉన్న ఒక్క బోరుకు పరికరాలు అమర్చకుండా వదిలేశారని.. నీటి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నా.. పట్టికోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. నీటి సమస్య కారణంగా.. నాలుగు రోజులకోసారి స్నానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగే నాయకులు.. తమ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదంటుని మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మూడేళ్లుగా తాగునీటి కష్టాలు

ABOUT THE AUTHOR

...view details