ETV Bharat / city

ఎమ్మెల్యే అనుచరుడు భూకబ్జా చేశారంటూ.. కర్నూలులో వృద్ధ దంపతుల ఆందోళన

author img

By

Published : Apr 1, 2022, 1:14 PM IST

Old Couple Protest: పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని పత్తికొండ ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేశారని ఓ వృద్ధ జంట కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అతడి నుంచి ప్రాణహాని ఉందంటూ నిరసన తెలిపారు.

Old Couple Protest
ఎమ్మెల్యే అనుచరుడు భూ కబ్జా చేశారంటూ

Old Couple Protest: కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రధాన అనుచరుడు భూ కబ్జా చేశారని పత్తికొండకు చెందిన వృద్ధ దంపతులు ధర్నా చేపట్టారు. అతడి నుంచి ప్రాణహాని ఉందంటూ మురళీమోహన్‌గౌడ్‌, జయదేవి గురువారం కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేశారు.

'పత్తికొండలోని సర్వే నంబరు 115, 116, 117లో 8.25 ఎకరాల భూమి మాకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది. ఇందులో మాకు దక్కాల్సిన వాటా కోసం కోర్టుకు వెళ్లాం. కేసు నడుస్తుండగానే మా దాయాదులు భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. ప్రసుత్తం పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు, వైకాపా నేత బాబిరెడ్ఢి.. తాను కొన్నానంటూ ఇటీవల భూమిలో పనులు చేపట్టారు. దీనిపై పత్తికొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాబిరెడ్డి నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని రక్షణ కల్పించాలి' -మురళీమోహన్‌గౌడ్‌, జయదేవి

'పత్తికొండ బైపాస్‌ రోడ్డు సమీపంలో 116, 117 సర్వే నంబర్లలో ఉన్న 25 సెంట్ల భూమిని కబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం... చట్టబద్ధంగా కొనుగోలు చేశాం.. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు.. ఎలాంటి కోర్టు ఆధారాలున్నా పోలీసుల సమక్షంలో చూపాలి" -అటికెలగుండు బాబిరెడ్డి, ఎమ్మెల్యే అనుచరుడు

ఇదీ చదవండి: Talli bidda express: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.