ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గవర్నర్​ను కలవడం నేరమెలా అవుతుంది.. ప్రశ్నించిన సూర్యనారాయణ

By

Published : Mar 26, 2023, 4:47 PM IST

AP EMPLOYEES UNION PRESIDENT SURYANARAYANA : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో.. ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు. అనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

AP EMPLOYEES UNION PRESIDENT SURYANARAYANA
AP EMPLOYEES UNION PRESIDENT SURYANARAYANA

AP EMPLOYEES UNION PRESIDENT SURYANARAYANA : ఆర్థిక ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం గవర్నర్‌ను కలవడం నేరమెలా అవుతుందని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలవడంపై ప్రభుత్వం సంజాయితీ ఎలా కోరుతుందని... తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ప్రయోజనాలు హక్కుల సాధన కోసం ఏప్రిల్‌ నుంచి చేపట్టనున్న ఆందోళనల సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన అనంతపురంలో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా సంగమేస్ సర్కిల్​లోని పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తాము చేపట్టబోయే ఉద్యమం ఫలితం రాబట్టే దిశగా ఉంటుందన్న ఆయన.. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నేరవేరే వరకూ పోరాటం ఆగబోదని తేల్చిచెప్పారు.

గవర్నర్​ను కలవడం నేరమెలా అవుతుంది.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సూర్యనారాయణ

పది వేల కోట్ల రూపాయలు.. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటే.. కేవలం 3 వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉద్యోగులను ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ. 20 వేల కోట్లను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉందన్నారు. సంఘాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వానికి భజన చేసే సంఘాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అరెస్టులు చేసిన, కేసులు నమోదు చేసిన ఉద్యమాలను ఆపేది లేదని తేల్చిచెప్పారు.

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం లేదు: గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్​లను ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదని ఏపీఎన్జీవో వెస్ట్ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. విజయవాడ ఎన్జీవో భవన్​లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదన్నారు. కొత్తగా కొన్ని బకాయిలు సృష్టించి.. మళ్లీ అవి రిలీజ్ చేసి ఏదో మంచి చేసాము అని చెబుతున్నారన్నారని విమర్శించారు. గత పీఆర్సీ స్కేల్ ఆఫ్ పే జీవో కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చెసే ఉద్దేశంతో లేదని ఆరోపించారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్​ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై చర్చిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికై ఉద్యమమే శరణ్యం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. ఏప్రిల్, మే లో ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details