ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్రావతి నదిలో చిక్కుకున్న జేసీబీ.. సహాయం కోసం 9మంది ఎదురుచూపు

By

Published : Nov 19, 2021, 10:40 AM IST

Updated : Nov 19, 2021, 12:21 PM IST

flood
వరద

10:38 November 19

చిత్రావతి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు

అనంతపురంలో భారీగా వరద ప్రవాహం.. ప్రొక్లెయిన్​​పైనే చిక్కుకుపోయిన 9 మంది

అనంతపురం జిల్లా డీకే పల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ప్రవాహంలో ప్రయాణికులతో సహా చిక్కుకుపోయిన కారును బయటకు తీసిన ఓ పొక్లెయిన్‌ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పొక్లెయిన్​లో తొమ్మిది మంది ఉన్నారు. వరద ప్రవాహం మధ్యలో పొక్లెయిన్‌పైనే చిక్కుకుపోయిన 9 మందిని కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

వరదలో చిక్కుకున్న వృద్ధులు..

కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద మద్ధిలేరు వాగు ప్రవాహంలో ఇద్దరు వృద్ధులు చిక్కుకున్నారు. వారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు.  

ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద నిర్మించిన సత్రాల కాపలా దారులుగా ఈ ఇద్దరు వృద్ధులు ఉంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మద్ది లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ అంతకంతకూ పెరిగి వృద్ధులు ఉంటున్న నివాసాన్ని చుట్టుముట్టాయి. భయాందోళనకు గురైన వృద్ధులు సమస్యను ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఈవోకు సమాచారమిచ్చారు.

వృద్ధులు వరదనీటి ప్రవాహంలో చిక్కుకున్న విషయం అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిసింది. దాంతో ప్రవాహంలో చిక్కుకున్న వృద్ధుల ఇద్దరిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వృద్ధులను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని ఎస్​ఐ సాగర్​ అభినందించారు. 

ఇదీ చదవండి: 

HEAVY RAINS: భారీ వర్షాలతో అనంత అతలాకుతలం..నీట మునిగిన పంటలు

Last Updated :Nov 19, 2021, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details