ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాబోయ్ ఎంత పెద్ద పాము..! చూస్తే కళ్లుతిరగడం ఖాయం

By

Published : May 12, 2022, 4:50 PM IST

King Cobra: సాధారణంగా చాలా మందికి చిన్న పాములను చూసినా.. వాటి పేరు చెప్పినా ఒళ్లు జలధరిస్తది. అదే 13 అడుగుల పామును చూస్తే ఇంకేమన్న ఉందా..! అలాంటి పాము ఒకటి అనకాపల్లి జిల్లా మాడుగులలోని ఓ పామాయిల్​ తోటలో కనిపించింది.

King Cobra
అమ్మో.. ఎంత పెద్ద పాము.. చూస్తే కళ్లుతిరగడం ఖాయం

King Cobra: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్​రోడ్డు సమీపంలోని ఓ పామాయిల్ తోటలో భారీ గిరినాగు కలకలం రేపింది. పామాయిల్ తోటలో కూలీలు పని చేస్తుండగా అత్యంత పొడవైన భారీ గిరినాగు కనిపించింది. దాంతో భయబ్రాంతులకు గురైన కూలీలు తక్షణమే తోట యజమానికి చెప్పారు. ఆయన వెంటనే వన్యప్రాణి సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ సభ్యులు వెంకటేష్, మరి కొంతమంది కొన్ని గంటలపాటు శ్రమించి గిరినాగును పట్టుకున్నారు. అది దాదాపు 13 అడుగుల పొడవు.. ఆరు కేజీల బరువు ఉంటుందని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు తెలిపారు. గిరినాగును గోనె సంచిలో బంధించి వంట్లమామిడి శివారులోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అమ్మో.. ఎంత పెద్ద పాము.. చూస్తే కళ్లుతిరగడం ఖాయం

ABOUT THE AUTHOR

...view details