రాజద్రోహం చట్టం అమలు నిలిపివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : చంద్రబాబు

author img

By

Published : May 12, 2022, 2:59 PM IST

Updated : May 12, 2022, 3:07 PM IST

Chandrababu naidu

Chandrababu on Article 124(A): రాజద్రోహం చట్టం (124 ఏ) అమలును నిలిపివేస్తూ.. దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు.

  • రాజద్రోహం చట్టం 124 ఏ అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయొద్దని చెప్పడంతో పాటు, ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయం.(1/2)

    — N Chandrababu Naidu (@ncbn) May 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CBN on Article 124(A): రాజద్రోహం చట్టం (124 ఏ) అమలును నిలిపివేస్తూ, దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయొద్దని చెప్పడంతోపాటు ఇప్పటికే పెట్టిన కేసులపై తదుపరి చర్యలు వద్దని స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. నియంతృత్వ పోకడలు అనుసరించే ప్రభుత్వాలు తమ రాజకీయకక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్న ఈ తరుణంలో.. ప్రజా హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.\

ఇవీ చదవండి :

Last Updated :May 12, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.