ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా మద్యం తరలిస్తూ.. పోలీసులకు చిక్కిన వైసీపీ నేత

By

Published : Jan 26, 2023, 7:01 PM IST

Task force police seized 50 cases of liquor: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకుడు.. అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట వద్ద బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివరాం బెంగళూరు నుంచి అక్రమంగా మద్యాన్ని కారులో తరలిస్తుండగా పక్కా సమాచారంతో ఖాజీపేట వద్ద పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. కారులో ఉన్న మద్యం విలువ దాదాపు 20 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శివరామ్​ని పోలీసులు కడప ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తున్నారు.

Task force police seized 50 cases of liquor
Task force police seized 50 cases of liquor

Task force police seized 50 cases of liquor: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకుడు.. అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట వద్ద బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివరామ్ కారు నుంచి.. 50 కేసుల కర్ణాటక మద్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని కారులో బ్రహ్మంగారిమఠానికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో ఖాజీపేట వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. కారులో ఉన్న మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో శివరామ్​ భార్య కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

శివరామ్​ దంపతులను కడప ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన కారులో ఉన్న 50 కేసుల మద్యాన్ని కూడా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శివరామ్​ని పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. కర్ణాటక మద్యం విలువ దాదాపు 20 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details