ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..

By

Published : Feb 16, 2022, 3:57 PM IST

Extra Marital Affair: తెలంగాణలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం భూ తగాదాలు, వివాహేతర సంబంధాలు, పాతకక్షల వల్లే చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వీటిలో వివాహేతర సంబంధాలు చాలా వరకు హత్యలకు దారితీస్తున్నాయి. అనైతిక సంబంధానికి భార్యో, భర్తో అడ్డొస్తున్నారని వారిని అడ్డు తొలగించుకోవడం లేదా.. ఎవరికైనా తెలిస్తే వాళ్లని హతమార్చడం.. ముఖ్యంగా తమ తల్లిదండ్రులు వేరే వాళ్లతో సన్నిహితంగా ఉండటం చూసిన పిల్లలను కూడా క్రూరంగా హత్య చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. సొంత మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. వాళ్లు ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని ఇద్దరూ కలిసి ఆ పసిపాపను హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులో చోటుచేసుకుంది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు శతవిధాలా ప్రయత్నించినా.. చివరకు పోలీసులకు చిక్కారు. పోలీసు విచారణలో మరో ట్విస్ట్ బయటపడింది.

illegal affair
illegal affair

Extra Marital Affair in Khammam : సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ. వాళ్లిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో కుమార్తె చూసింది. అది తెలుసుకున్న వాళ్లు.. ఆమెను అడ్డుతొలగించుకునేందుకు వ్యూహం పన్నారు. ఎలాగోలా ఆ పసిపాపను హతమార్చి.. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. కానీ ఆమె మెడపై రాపిడి ఉండటం గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మామా కోడళ్లను విచారించగా.. మరో ట్విస్ట్ బయటపడింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లులో చోటు చేసుకుంది.

Mother Killed daughter in Khammam : వైరా ఏసీపీ స్నేహా మెహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీతతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల పాప ఉంది. కొంతకాలంగా ఈమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు బాలిక చూడటంతో మామతో కలిసి కన్న కూతురినే హతమార్చింది. ఈనెల 9న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపారు. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా బాలిక ఫిట్స్‌ వచ్చి కింద పడటంతో దెబ్బ తగిలిందని మృతదేహాన్ని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించుకొన్నారు. పీహెచ్‌సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. ‘వెంటనే ఖమ్మం తీసుకెళ్లమని’ పంపించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పాప చనిపోయిందని నిర్ధారించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని కోరారు. చిన్నారి మెడపై రాపిడి గుర్తులు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

శతవిధాలా ప్రయత్నించినా.. :

Grand Father Killed Grand Daughter in Khammam : పోస్టుమార్టం జరిగితే అసలు విషయం బయట పడుతుందని నిందితుడు నరసింహారావు ఆపేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. చిన్న పిల్లను కోయడం మంచిది కాదని, చూసి తట్టుకోలేమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు, వైద్యులు అంగీకరించకుండా పోస్టుమార్టం చేశారు. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు. ఆ యువకుడికి తన కోడలికి వివాహేతర సంబంధం ఉందని అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమేనని కాని హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు ఆధారాలు సేకరించి తల్లిని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపడింది. అప్పటికే పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ అయింది. నిందితులు నేరం అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ చెప్పారు. చిన్న ఆధారంతో పోలీసులు కేసుని ఛేదించినట్లు ఏసీపీ సేహామెహ్రా వివరించారు. ఇంట్లో చున్ని 75 శాతం ఉంది. 25 శాతం కట్ చేసి ఉంది. 25 శాతం చున్ని ఏమైందని పరిశీలించగా దాంతోనే చిన్నారి కాళ్లు, చేతులు కట్టి గొంతుకు వైరుతో బిగించి చంపారని తేలిందన్నారు. వారంలో మిస్టరీ ఛేదించినందుకు సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details