ఆంధ్రప్రదేశ్

andhra pradesh

brother attack: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది !

By

Published : Oct 25, 2021, 4:55 PM IST

అన్నదమ్ముల నడుమ చెలరేగిన ఘర్షణలు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా... గొంతుకోసే దాకా వచ్చాయి. అర్ధరాత్రి.. క్షణికావేశంలో తమ్ముడు అన్న గొంతు కోయగా.. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

అన్నదమ్ముల మధ్య ఘర్షణ
అన్నదమ్ముల మధ్య ఘర్షణ

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్తా... ప్రాణాల మీదకు తెచ్చింది. బర్దీపూర్‌కి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్... కత్తితో అన్న మతిన్‌ గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన మతిన్​ను.. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గతకొన్ని రోజుల నుంచి ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చినికి చినికి గాలివానలా తయారై గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చిందని వెల్లడించారు.మతిన్​కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.

ఇదీ చదవండి:suicide attempt: కులం పేరుతో దూషణ.. యువకుడి ఆత్మహత్యాయత్నం!

ABOUT THE AUTHOR

...view details