ETV Bharat / state

suicide attempt: కులం పేరుతో దూషణ.. యువకుడి ఆత్మహత్యాయత్నం!

author img

By

Published : Oct 25, 2021, 2:24 PM IST

గుంటూరు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కులం పేరుతో దూషించారని.. అందుకే మనస్థాపంతో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.

suicide attempt
suicide attempt

గుంటూరు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మేడికొండూరు మండలం ఎలవర్తిపాడు గ్రామానికి చెందిన యేరసాని రాజు.. గతంలో వాలంటీర్​గా పని చేసేవాడు. ఆ సమయంలో రైతు భరోసా కేంద్రంలో 15 ఎరువుల కట్టలు మాయమయ్యాయి. ఈ ఘటనకు.. రాజును బాధ్యున్ని చేస్తూ.. వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే రాజును కొందరు వ్యక్తులు.. కులం పేరుతో దూషించి అవమానకరంగా మాట్లాడారట. తీవ్ర మనస్తాపానికి గురైన రాజు.. శీతల పానీయంలో పురుగు మందు కలుపుకుని తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయమై ఫిర్యాదు అందడంతో.. నిందితులు మొగిలి శ్రీను, నాగా శ్రీను, హోటల్ సుభాని, పాలడుగు ముజీర్, గుర్రపు బాషా, బాబు అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

కీసరలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.