ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM

By

Published : Sep 6, 2021, 3:00 PM IST

..

TOP NEWS @3PM
ప్రధానవార్తలు @3PM

  • WEATHER REPORT: రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
    ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Inter online admissions: ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ను కొట్టేసిన హైకోర్టు
    ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్‌ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దుచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కలెక్టరేట్లను ముట్టడిస్తున్న భాజపా నాయకులు.. పలు చోట్ల ఉద్రిక్తత
    వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా నేతలు.. కలెక్టరేట్ల ముట్టడించగా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించటంతో ఉద్రికత్త నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • DEVINENI UMA: 'రైతుల హక్కులను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు?'
    కృష్ణా జలాల్లో తమకు 50 శాతం వాటా ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తుంటే... జగన్ ఎం చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మమతపై పోటీకి కాంగ్రెస్​ నో.. 'వార్ వన్​ సైడే'!
    భవానీపుర్​ అసెంబ్లీ ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీపై(Mamata Banerjee) పోటీకి కాంగ్రెస్​ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ట్రైబ్యునళ్ల ప్రాధాన్యం తగ్గిస్తారా?: కేంద్రంపై సుప్రీం అసహనం
    ట్రైబ్యునళ్లలో(Tribunals) ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ.. వాటి ప్రాధాన్యతను కేంద్రం తగ్గిస్తోందని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు(Supreme court). న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై గౌరవం లేనట్టుగా కేంద్రం చర్యలు కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్యాంకులకు వరుస సెలవులు- వారంలో ఐదు రోజులు బంద్!
    ఈ వారం బ్యాంకులు వరుస సెలవుల్లో (Bank Holidays) ఉండనున్నాయి. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే ముందుగానే సెలవుల గురించి తెలుసుకుని వాటిని పూర్తి చేసుకోవడం ఉత్తమం. మరి బ్యాంకులు ఏఏ రోజు సెలవులో (Bank holidays in September) ఉండన్నాయో తెలుసుకోండి ఇప్పుడే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మార్కెట్లో రిలయన్స్ దూకుడు- రూ.3వేలపైకి ఐఆర్​సీటీసీ షేరు
    స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries share) లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో సెషన్​లోనూ (సోమవారం) ఈ షేర్లు 2 శాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఐఆర్​సీటీసీ షేరు కూడా (IRCTC Share Price) రూ.3000 మార్క్​ను దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • India T20 WC squad: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టు ఇదేనా?
    టీ20 ప్రపంచకప్​ జట్టు(India T20 WC Team) ను బీసీసీఐ సెలక్టర్ల బృందం (BCCI selection committee) ఇప్పటికే ఎంపిక చేసిందని సమాచారం. ఈ విషయమై ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సమావేశమైందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కృతిశెట్టితో అందుకే రొమాన్స్​ చేయలేను'
    'ఉప్పెన' సినిమాలో బేబమ్మ పాత్రలో నటించిన కృతిశెట్టితో తాను రొమాన్స్ చేయలేనన్నారు నటుడు విజయ్‌ సేతుపతి. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. అందుకు నో చెప్పారు విజయ్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details