ఆంధ్రప్రదేశ్

andhra pradesh

JP nadda meet Mithaliraj మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ

By

Published : Aug 27, 2022, 8:45 PM IST

JP nadda meet Mithaliraj భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాను మహిళల క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలో జరిగే సభకోసం హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన నోవాటెల్‌ హోటల్‌లో మిథాలిరాజ్​తో భేటీ అయ్యారు.

JP nadda meet Mithaliraj
మిథాలీరాజ్‌ను కలిసిన జేపీ నడ్డా

JP nadda meet Mithaliraj శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో క్రికెటర్ మిథాలీరాజ్‌తో భాజపా జాతయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. దిల్లీ నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకున్న నడ్డాని మాజీ క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలకు లభిస్తున్న మద్దతుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్‌ను శాలువ కప్పి సన్మానించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభ కోసం రాష్ట్రానికి విచ్చేశారు. ఇవాళ హనుమకొండలో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభకు హాజరవుతారు. ఇవాళ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత టాలీవుడ్‌ హీరో నితిన్‌తో నడ్డా భేటీ కానున్నారు. ఇటీవల మునుగోడు సభకు హాజరైన అమిత్‌ షా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను కలవడం చర్చకు దారి తీసింది. మరోవైపు ఇవాళ నితిన్‌తో నడ్డా భేటీ కానున్నడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి:రసవత్తరంగా ఝార్ఖండ్​ రాజకీయం, క్యాంపులకు ఎమ్మెల్యేల తరలింపు

ABOUT THE AUTHOR

...view details