ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధానవార్తలు@9am

By

Published : Sep 20, 2022, 9:00 AM IST

.

9am topnews
ప్రధానవార్తలు@9am

  • నిపుణుల మాట వేరు... పోలవరం వైఫల్యం జగన్‌ ప్రభుత్వానిదే

పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేశారన్న మాటలు అవాస్తమనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు పోలవరంపై నిపుణుల మాట వేరుగా ఉంది. పోలవరం వైఫల్యం జగన్‌ ప్రభుత్వానిదే అని ఐఐటీ హైదరాబాద్​ బృందం చెబుతోంది. తటస్థ కమిటీనే తేల్చిందీ విషయం.

  • వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కితగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కోసం ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని న్యాయవాది తెలిపారు. విచారణను హైకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది.

  • లుక్​అవుట్​ సర్క్యులర్‌ను రద్దు చేయాలని... మాజీ మంత్రి నారాయణ పిటిషన్​

లుక్​అవుట్​ సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ.. సోమవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లేందుకు ఇప్పటికే హైకోర్టు అనుమతి ఇచ్చిందని... ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎల్​వోసీ జారీ చేశారని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో వేధించడం కోసం పలు కేసులు తనపై నమోదు చేశారని... ఆయా నేరాలతో తనకు సంబంధం లేదని వ్యాజ్యంలో తెలిపారు.

  • దసరా పండుగకు వెళ్తున్నారా... అయితే మీకో శుభవార్త

దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి ప్రత్యేక బస్సులలో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని ప్రకటించింది.

  • 'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చంటూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడారు.

  • నడిరోడ్డుపై కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారం వల్లే!

యువకుడిని వెంబడించి కత్తులతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని కలబురగిలో వెలుగు చూసింది. ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డైంది. కలబురగిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జమీర్ (23).. ఆదివారం బైక్‌పై బయటకు వెళ్తుండగా ఇద్దరు దుండగులు కత్తులతో పలుమార్లు పొడిచి చంపారు.

  • విమానంలో ప్రయాణికుడి హల్​చల్.. కాళ్లతో కిటికీలు పగలగొట్టే యత్నం.. చివరకు..

పెషావర్ నుంచి దుబాయ్​ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమాన సిబ్బందితో గొడవ పడ్డాడు. అక్కడితో ఆగకుండా కోపంతో విమాన సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. కిటికీలను కాళ్లతో తన్నాడు. విమాన సిబ్బంది అతడిని సీటుకు కట్టేసి.. దుబాయ్​లో పోలీసులకు అప్పగించారు.

  • ఆసియా-పసిఫిక్‌లో తగ్గిన ప్రయాణికుల రద్దీ.. ఈ ఏడాది 184 కోట్లే

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఈ ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య తక్కువగానే నమోదవుతుందని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌-ఏషియా పసిఫిక్‌ నివేదిక అంచనా వేసింది. దేశంలోకి విదేశీయులను అనుమతించడంలో జపాన్‌ జాగ్రత్త ధోరణే దీనికి కారణమని అభిప్రాయపడింది.

  • 'కోహ్లీకి ఏదీ అసాధ్యం కాదు.. గాడిలో పడితే చెలరేగడమే'

విరాట్‌ కోహ్లికి ఏదీ అసాధ్యం కాదు అని అనుకోవట్లేదని.. అతడు సచిన్‌ తెందుల్కర్‌ అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు కూడా అధిగమించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు.

  • 'నటిగా నాకు కొన్ని పరిమితులున్నాయి.. నేను చాలా స్ట్రాంగ్'

"ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. కథ ఎంత వినూత్నంగా ఉంటుందో.. దాన్ని తెరకెక్కించిన తీరూ అంతే కొత్తగా ఉంటుంది" అంది నటి ప్రీతి అస్రాని. ఆమె.. శ్రీ సింహ కోడూరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్‌ త్రిపుర తెరకెక్కించారు.

ABOUT THE AUTHOR

...view details