ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధాన వార్తలు@1PM

By

Published : Jul 21, 2022, 12:56 PM IST

.

ap topnews
ap topnews

  • పోలవరాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లే: సోము వీర్రాజు..
    పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం అంశాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని అన్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో.. #APHopeCBN హ్యాష్ ట్యాగ్..
    #APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీపీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మహాసేన 'యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడిపై కేసు.. ఎందుకంటే?..
    కాకినాడకు చెందిన మహాసేన మీడియా యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడు రాజేశ్​, అతని అనుచరుడు ఎర్ర దీపక్​లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఎయిమ్​' సంస్థ వ్యవస్థాపకుడు, సీఐడీ అధికారి పి.వి.సునీల్​కుమార్​పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ శ్రీకాకుళం జిల్లా ఎయిమ్ ప్రతినిధులు ఇటీవల రెండో పట్టణ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన..
    గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో, నరకయాతన అనుభవిస్తున్నామని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తమ ఇళ్లలకు చేరుకుంటున్న బాధితులు.. ఆస్తి, పంట నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఈడీ విచారణకు సోనియా.. తోడుగా ప్రియాంక.. దేశవ్యాప్తంగా నిరసనలు..
    సోనియా గాంధీకి మద్దతుగా నిరసన చేస్తున్న కాంగ్రెస్​ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు.. పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'రాష్ట్రపతి ఎన్నిక' ఓట్ల లెక్కింపు షురూ.. 'ముర్ము' విజయం లాంఛనమే..
    భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో కొద్దిగంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. పార్లమెంటు భవనంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభం అవగా.. సాయంత్రం 3-4 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'నా పేరుకు, డ్రెస్సింగ్ స్టైల్​కు సంబంధమే లేదు.. ఆ తర్వాతే నాకు బుద్ధి వచ్చింది!'..
    ఆకట్టుకునే అందం, అంతకు మించిన వాక్చాతుర్యంతో తెలుగింటి ఆడపడుచులా మారిపోయింది అనసూయ భరద్వాజ్‌. ఓవైపు యాంకర్‌గా బుల్లితెరలో హవా కొనసాగిస్తూనే.. మరో వైపు 'రంగమ్మత్త', 'దాక్షాయని' లాంటి పాత్రలతో సిల్వర్‌ స్ర్కీన్ పైనా సత్తా చాటుతోందీ ముద్దుగుమ్మ. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • డోప్‌ పరీక్షలో ఫెయిల్​.. కామన్​వెల్త్​ రేసు నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు ఔట్​..
    భారత జట్టులో మరోసారి డోపింగ్​ కలకలం సృష్టించింది. కామన్​వెల్త్​ క్రీడలకు ఎంపికైన అథ్లెట్లు ఎస్​.ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది. ఈ అథ్లెట్లు ఇలా డోప్​ పరీక్షల్లో విఫలమవడం ఇది రెండోసారి. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పుతిన్ ఎదురుచూపులు.. ఎర్డోగన్‌ ప్రతీకారం తీర్చుకున్నారా..?
    రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో ఇరాన్‌లో జరిగిన సమావేశానికి ముందు ఒంటరిగా కొద్దిసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details