ETV Bharat / state

'మహాసేన 'యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడిపై కేసు.. ఎందుకంటే?

author img

By

Published : Jul 21, 2022, 12:48 PM IST

MAHASENA: కాకినాడకు చెందిన మహాసేన మీడియా యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడు రాజేశ్​, అతని అనుచరుడు ఎర్ర దీపక్​లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఎయిమ్​' సంస్థ వ్యవస్థాపకుడు, సీఐడీ అధికారి పి.వి.సునీల్​కుమార్​పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ శ్రీకాకుళం జిల్లా ఎయిమ్ ప్రతినిధులు ఇటీవల రెండో పట్టణ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

MAHASENA
MAHASENA

CASE FILE: కాకినాడకు చెందిన మహాసేన మీడియా యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడు రాజేశ్​, అతని అనుచరుడు ఎర్ర దీపక్​లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు 'ఎయిమ్​' సంస్థ వ్యవస్థాపకుడు, సీఐడీ అధికారి పి.వి.సునీల్​కుమార్​పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ శ్రీకాకుళం జిల్లా ఎయిమ్ ప్రతినిధులు ఇటీవల రెండో పట్టణ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో రాజేశ్, దీపక్​ బుధవారం శ్రీకాకుళంలోని రెండో పట్టణ పోలీసుస్టేషన్​కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం విడిచిపెట్టారు. వారు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా మళ్లీ లోపలికి తీసుకెళ్లారు. రాత్రి 8.30 గంటలకు విడిచిపెట్టగా అక్కడి నుంచి రాజేశ్, తదితరులు పెద్దపాడు పోలీసుస్టేషన్​కు ర్యాలీగా చేరుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా వారని స్టేషన్​కి పిలిచామని సీఐ ఈశ్వరప్రసాద్​ చెప్పారు. విచారణకు సహకరించకపోవడంతో మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేశామన్నారు. వారి కార్లకు సంబంధించిన పత్రాలు చూపించక పోవడం వల్ల వాటిని ఆర్డీవో అధికారుల వద్దకు పంపామని తెలిపారు.

దళితులపై వేధింపులు: వైకాపా సర్కారుపై తన పోరాటం ఆపబోనని.. మహాసేన మీడియా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రాజేష్ అన్నారు. పోలీసులు 41-A నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు రాజేష్ వెళ్లారు. తన బృంద సభ్యుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే.. పోలీసులు తన బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారని వెల్లడించారు. విచారణ పేరుతో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పీఎస్​లోనే ఉంచారంటూ..ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మహాసేన 'యూట్యూబ్​ ఛానల్​ నిర్వహకుడిపై కేసు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.