ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Top News 7 pm: ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Aug 31, 2022, 7:00 PM IST

.

top news 7 pm
top news 7 pm

  • నెల్లూరులో జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. సప్లయరే హంతకుడు
    POLICE SOLVED THE COUPLE MURDER CASE: నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును.. పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 28వ తేదీన నెల్లూరులోని అశోక్‌నగర్‌లోని వారి నివాసంలోనే.. వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత దారుణ హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసులపై కక్ష సాధింపు తగదు.. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
    MLA Anagani on Police issue: ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న పోలీసులపై కక్ష సాధింపులు తగవని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెన్నా నదికి పోటెత్తిన వరద.. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు
    PENNA RIVER WATER FLOW: ఎగువున కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని పెన్నా నదికి వరద పోటెత్తింది. పేరూరు సమీపంలో ఉన్న అప్పర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లను అధికారులు తెరిచారు. ధర్మవరం-కళ్యాణదుర్గం మధ్య నూతిమడుగు సమీపంలోని కాజ్​వే దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • CM KCR Fire On BJP: భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పని చేస్తాం: కేసీఆర్‌
    KCR: భాజపాపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకమై.. భాజపా ముక్త్​ భారత్​ కోసం పని చేయాలని సూచించారు. పట్నాలో బిహార్​ ముఖ్యమంత్రి నీతిశ్​తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అనేక విషయాలు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఉగ్ర సంస్థలతో లింకులు'.. బుల్డోజర్​తో మదర్సా కూల్చివేత
    Assam Madrassa Demolished : అసోంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధముందని మరో మదర్సాను కూల్చివేశారు అధికారులు. బొంగాయ్​గావ్​ జిల్లాలో కబైతరి మా అరిఫ్​ అనే మదర్సాను నేలమట్టం చేశారు. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​ సమాజ్​వాదీ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణాలను కూల్చివేశారు లఖ్​నవూ మున్సిపల్​ అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం
    కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి పౌలా మైనో ఇటలీలో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రహస్య పత్రాల కేసులో ట్రంప్​కు మరిన్ని చిక్కులు
    రహస్య పత్రాల తరలింపు వివాదంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన దర్యాప్తు బృందం కొన్ని రహస్య పత్రాలను గుర్తించి, కోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2022-23 క్యూ1లో జీడీపీ వృద్ధిరేటు 13.5%
    2022-23 క్యూ1లో దేశ జీడీపీ 13.5శాతం వృద్ధి చెందింది. జాతీయ గణాంకాల కార్యాలయం బుధవారం ఈ విషయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాగార్జున బిగ్​బాస్ సీజన్​ 6​ ఫస్ట్ గ్లింప్స్​ ఆగయా
    Bigboss first glimpse released రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు మేకర్స్​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గణేష్​ చతుర్థి విషెస్​తో మనసు దోచేసిన వార్నర్​
    దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్‌ విగ్రహాలను ఏర్పాట చేసుకుని పూజాపురస్కారాలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ వార్నర్​ పెట్టిన పోస్ట్ మాత్రం​ వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details