ETV Bharat / city

CM KCR Fire On BJP: భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పని చేస్తాం: కేసీఆర్‌

author img

By

Published : Aug 31, 2022, 6:14 PM IST

kcr and nitish
kcr and nitish

KCR: భాజపాపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకమై.. భాజపా ముక్త్​ భారత్​ కోసం పని చేయాలని సూచించారు. పట్నాలో బిహార్​ ముఖ్యమంత్రి నీతిశ్​తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అనేక విషయాలు వెల్లడించారు.

CM KCR Fire On BJP: భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి రావాలని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ను కోరినట్లు తెలిపారు. పట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నీతీశ్‌ కూడా భాజపా ముక్త్‌ భారత్‌ కోరుకుంటున్నారని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు హామీ ఏమైంది. భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలి. రొటీన్‌ ప్రభుత్వాలు వద్దు.. భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలి. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్‌తో చర్చించా. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు. చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. విద్వేషం పెరిగితే దేశానికి నష్టం. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా?. రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటీకరిస్తారా?. రైతుల ఆదాయం రెట్టింపు చేశారా?.భాజపా ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిందే. రూపాయి ఈ స్థాయిలో ఎన్నడూ పతనం కాలేదు. సమృద్ధిగా జలాలు ఉన్నా జల యుద్ధాలు ఆగట్లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వట్లేదు. దిల్లీలోనూ తాగునీరు, విద్యుత్‌ సమస్య పరిష్కరించలేదు. ధరలు పెరిగి.. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.- కేసీఆర్‌, తెలంగాణ సీఎం

దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోదీ సర్కార్ ఉందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. భాజపా పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని మండిపడ్డారు. మోదీ సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉందని తెలిపారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కేసీఆర్‌ మండిపడ్డారు.

ధరలు పెరిగి.. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా.. వినియోగించుకోవట్లేదని తెలిపారు. బేటీ బచావో-బేటీ పఢావో నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని భాజపాను ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం మంచిచేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారని కేంద్రాన్ని నిలదీశారు. మంచి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం పేరుకు మాత్రమేనని.. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.