ETV Bharat / state

పెన్నా నదికి పోటెత్తిన వరద.. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు

author img

By

Published : Aug 31, 2022, 3:47 PM IST

PENNA RIVER WATER FLOW: ఎగువున కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని పెన్నా నదికి వరద పోటెత్తింది. పేరూరు సమీపంలో ఉన్న అప్పర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లను అధికారులు తెరిచారు. ధర్మవరం-కళ్యాణదుర్గం మధ్య నూతిమడుగు సమీపంలోని కాజ్​వే దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WATER FLOW AT PENNA
WATER FLOW AT PENNA

WATER FLOW AT PENNA: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అనంతపురం జిల్లాలోని పెన్నా నదికి వరద పోటెత్తింది. దీంతో పేరూరు సమీపంలోని అప్పర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లను అధికారులు తెరిచారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ధర్మవరం-కళ్యాణదుర్గం మధ్య ఉన్న నూతిమడుగు కాజ్​వే దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్​వేపై కూడా నీరు ప్రవహిస్తుండడంతో పొలం పనులు కోసం వెళ్లే రైతులు సైతం అష్టకష్టాలు పడుతున్నారు. మోటార్ సైకిల్ నడుపుతున్న ఓ యువకుడు అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో అతడిని రక్షించారు.

ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.