ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 27, 2022, 5:03 PM IST

Updated : Jul 27, 2022, 5:44 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఎప్పుడంటే..!
    Assembly constituencies: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ అన్నారు. నియోజకవర్గాల పెంపుపై.. భాజపా ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తగా.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూసీ ఉద్ధృతితో మూసారాంబాగ్​ బ్రిడ్జి మూసివేత.. ట్రాఫిక్​ ఆంక్షలు
    Musi River Overflow: మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో.. హైదరాబాద్​లోని మూసారాంబాగ్​ వంతెనపై నుంచి వరద వెళ్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఆ బ్రిడ్జిని మూసేశారు. వరద పెద్దఎత్తున రావటం వల్ల ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాదారులకు ప్రత్యామ్నాయాలను సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలవరం నిర్వాసితులకు రూ.10 కూడా ఇవ్వలేదు: నిమ్మల
    NIMMALA: పునరావాసం ప్యాకేజీపై జగన్ రెడ్డి బూటకపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు 10లక్షల పరిహారం ఇస్తానని చెప్పి.. 10 రూపాయలు కూడా సాయం చేయలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అనుమతికి మించి తవ్వారని తేలితే.. చర్యలు తప్పవు: హైకోర్టు
    HIGH COURT: రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అనుమతికి మించి మైనింగ్‌ చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అడ్వకేట్ కమిషన్​ను రుషికొండకు పంపిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సోనియాకు ఈడీ 110 ప్రశ్నలు.. అన్నింటికీ ఒకటే సమాధానం!
    Sonia Gandhi ED probe: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. అవసరమైనప్పుడు మరోసారి పిలుస్తామని తెలిపింది. మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Live Video: స్కూటీని ఢీకొట్టిన ఎద్దు.. ఆమెకు గాయాలు.. మరొకరిని గాల్లోకి ఎగరేసి..
    గుజరాత్​ నవ్​సరిలో బైక్​పై వెళ్తున్న మహిళపై ఓ ఎద్దు దాడి చేసింది. మహిళ వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దు.. ఆమెను ఢీకొట్టింది. దీంతో మహిళ కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎద్దు యజమానికి ఫిర్యాదు చేయగా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆమెకు ఐదో కాన్పులోనూ కవలలే.. మొత్తం 10 మంది.. ఇల్లొదిలి భర్త పరార్!
    'ఒక్కరు లేదా ఇద్దరు'... పిల్లల విషయంలో ప్రస్తుతం దాదాపు అందరి ఆలోచన ఇదే. కానీ.. ఆమె మాత్రం ఐదు సార్లు గర్భం దాల్చింది. ప్రతిసారీ కవలలకే జన్మనిచ్చింది. 10 మంది పిల్లల్ని పెంచడం నా వల్ల కాదంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు భర్త. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది భార్య. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా?
    Rupee as international currency: రూపాయి.. అంతర్జాతీయ కరెన్సీగా మారడం సాధ్యమేనా? అందుకున్న ప్రధాన సవాళ్లేంటి? అధిగమించే దిశగా రిజర్వు బ్యాంకు, కేంద్రం ఏం చేస్తున్నాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు.. లైవ్​లోకి ధోనీ
    రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్‌ పంత్‌. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్​లోకి ధోనీని లాగేందుకు పంత్​ ప్రయత్నించడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏజ్ 52.. ఫస్ట్ మూవీ బడ్జెట్ రూ.60కోట్లు.. ఎవరీ 'లెజెండ్ శరవణన్'?
    Arulsarvanan The Legend movie: బ్యాక్​గ్రౌండ్​, బ్యాంక్​ బ్యాలన్స్​ ఉండి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో. హీరో మెటీరియల్​ కాకపోయినా టాలెంట్​తో సంబంధం లేకుండా.. సినిమాపై ఉన్న ఆసక్తితో ఎంతోమంది నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడా ఆ కోవలోనే తన లక్​ పరీక్షించుకోవడానికి ఓ బిజ్​నెస్​మ్యాన్​ హీరోగా గ్రాండ్​ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనే ది లెజెండ్​ శరవణన్‌. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Jul 27, 2022, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details