ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 15, 2022, 4:59 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • మంత్రి రోజా ఎదుట బాధితుల ఆవేదన.. వైకాపాను నమ్ముకుంటే ఇలా చేస్తారా?
    Minister Roja: వైకాపాను నమ్ముకుని పనులు చేస్తే.. బిల్లులు రాకా అప్పుల పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రోజా నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా.. బుట్టిరెడ్డి కండ్రిగకు వచ్చిన రోజా ఎదుట మాజీ సర్పంచ్​, ఆయన భార్య తమ గోడు వెళ్లబోసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యానాంను ముంచెత్తిన వరద.. పునరావస కేంద్రాలకు బాధితుల తరలింపు
    Godavari flood effect on Yanam : గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంను గోదావరి జలాలు ముంచెత్తాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలటంతో.. యానాంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. ముంపు ప్రాంతాలను పుదుచ్చేరి, దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పడవపై వెళ్లి పరిశీలించారు. బాధితులను పునరావస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణుల యత్నం
    Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పది వేలు ఇచ్చి.. పదింతలు వసూలు చేస్తున్నారు: వంగలపూడి అనిత
    TDP ANITHA: వాహనమిత్ర పేరిట ఇస్తున్న పది వేల రూపాయలు ఆటో రిపేర్లకు చాలవని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత విమర్శించారు. 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌ వాడే జగన్‌కు.. రోడ్ల దుస్థితి ఏం తెలుస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Viral Video: సుడిగాలి బీభత్సం.. వణికిపోయిన ఊరి జనం
    మధ్యప్రదేశ్​లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. షాజాపుర్​ జిల్లాలోని బోలాయి గ్రామంలో హనుమాన్​ ఆలయ సమీపంలో గురువారం ఒక్కసారిగా ఏర్పడిన సుడిగాలిని చూసి గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టోర్నడో ప్రభావంతో ఆ ప్రాంతంలో ఉన్న అనేక చెట్లు నేలకూలాయి. పంటపొలాలు సైతం దెబ్బతిన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సిద్దరామయ్యకు చేదు అనుభవం.. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ!
    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బాగల్​కోటె పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వగా ఓ ముస్లిం మహిళ ఆయన ఎస్కార్ట్​పైకి విసిరేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఆరుగురు మృతి
    Godown Collapsed: దిల్లీలోని అలీపుర్​లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి!
    రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్‌లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణం మరింత భారం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అదరగొట్టిన పీవీ సింధు.. సైనా, ప్రణయ్​ టోర్నీ నుంచి ఔట్​
    Singapore open 2022: సింగపూర్ ఓపెన్​ క్వార్టర్స్​ ఫైనల్​లో పీవీ సింధు సత్తా చాటగా.. సైనా నెహ్వాల్​, హెచ్ఎస్​ ప్రణయ్​కు భంగపాటు ఎదురైంది. దీంతో సింధు సెమీఫైనల్​కు అర్హత సాధించగా.. మిగతా ఇద్దరు టోర్నీ నుంచి నిష్క్రమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యాంకర్​పై హీరో సుశాంత్​ ఫైర్.. ఏం జరిగిందంటే?
    Actor Sushanth fire on anchor: తనను అసహనానికి గురయ్యేలా ప్రశ్నలు వేసిన ఓ యాంకర్​పై హీరో సుశాంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో హల్​చల్​ చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details