ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 22, 2022, 5:00 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM ()

..

  • ఆ కేసులను అనుమతి లేకుండా ఎలా ఎత్తి వేస్తారు: హైకోర్టు
    High Court: ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఎలా ఎత్తివేస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీద ఉన్న 10 కేసులను ఎత్తివేయడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు.. వాటిలో ఎన్నింటికి హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పచ్చి మాంసం పందెం.. తీసింది ఓ వ్యక్తి ప్రాణం !
    Pork Meat: అకతాయిగా చేసే పనులు కొన్నిసార్లు లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. మరికొన్ని సార్లు ప్రాణాలనే బలి తీసుకుంటాయి. అలా అర్థాంతరంగా తనువు చాలించిన వారెందరో. అచ్చం అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. పచ్చి పంది మాంసం తినటానికి పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • YCP Councilor: వైకాపా కౌన్సిలర్​ అరాచకం.. బుల్లితెర నటుడు చాన్ బాషాపై దాడి
    ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. గాయపడిన చాన్​ బాషాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఓ స్థలం విషయంలో చాన్ భాషా, కౌన్సిలర్ మధ్య నెలకొన్న వివాదం.. దాడికి దారి తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీఎం జగన్.. నయా తుగ్లక్​గా వ్యవహరిస్తున్నారు'
    CPM Leader Binay Vishwam: అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కాడా లేని విధంగా సీఎం జగన్​ మూడు రాజధానులంటూ.. ఆధునిక తుగ్లక్​గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం కోసం రాజధాని రైతులు.. తమ ఆకాంక్షలు చంపుకోవాల్సిన పని లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విచారణకు హాజరుకాలేను.. వాయిదా వేయండి'.. ఈడీకి సోనియా లేఖ
    Sonia Gandhi ED case: కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని సోనియా గాంధీ.. ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మోదీజీ.. నల్లచట్టాల్లాగే 'అగ్నిపథ్'​ పథకాన్ని వెనక్కి తీసుకుంటారు'
    Rahul Gandhi Agnipath: భారత్​పైకి చైనా విరుచుకపడడానికి చూస్తున్న సమయంలో.. సైన్యాన్ని కేంద్రం మరింత బలపరచాల్సింది పోయి బలహీనపరుస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లాగే 'అగ్నిపథ్​' పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ అప్పగించారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ భూకంపం.. 920 మంది మృతి
    అఫ్గానిస్థాన్ భూకంపంలో కనీసం 920 మృతి చెంది ఉంటారని ఆ దేశ అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. మరో 600 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మొదట 255 మంది మృతి చెందినట్లు అంచనా వేసినప్పటికీ ఆ సంఖ్య భారీగా పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్​ 700 పాయింట్లు డౌన్
    స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి 51,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 15,413కి పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులున్నప్పటికీ ఆసియా మార్కెట్ల ప్రతికూలతలు సూచీలను ప్రభావితం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డీకే.. ఏకంగా 108 స్థానాలు జంప్​ .. టాప్​10లో భారత్​ నుంచి ఆ ఒక్కడే
    ఐపీఎల్​ నుంచి అద్భుత ఫామ్ కొనసాగిస్తూ, అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న దినేశ్​ కార్తీక్​.. టీ20 ర్యాంకింగ్స్​లో అమాంతం దూసుకొచ్చాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీ20 బ్యాటర్ల జాబితాలో టాప్​ 10లో ఉన్న ఏకైక భారత క్రికెటర్​గా నిలిచాడు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశ్వక్​సేన్ కొత్త సినిమాకు స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. రణ్​బీర్​ 'షంషేరా' టీజర్​ అదుర్స్​
    నాగ చైతన్య, రణ్​బీర్​ కపూర్​, విశ్వక్​సేన్ కొత్త సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్స్​ వచ్చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details