డీకే.. ఏకంగా 108 స్థానాలు జంప్​ .. టాప్​10లో భారత్​ నుంచి ఆ ఒక్కడే

author img

By

Published : Jun 22, 2022, 4:02 PM IST

icc t20 rankings 2022

ఐపీఎల్​ నుంచి అద్భుత ఫామ్ కొనసాగిస్తూ, అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న దినేశ్​ కార్తీక్​.. టీ20 ర్యాంకింగ్స్​లో అమాంతం దూసుకొచ్చాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీ20 బ్యాటర్ల జాబితాలో టాప్​ 10లో ఉన్న ఏకైక భారత క్రికెటర్​గా నిలిచాడు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.

టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్న సీనియర్​ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో ఏకంగా 108 స్థానాలు మెరుగయ్యాడు. బుధవారం ప్రకటించిన బ్యాటర్ల టీ20 ర్యాంకింగ్స్​లో 87వ స్థానంలో నిలిచాడు. యువ ఓపెనర్​ ఇషాన్ కిషన్ టాప్ 10​లో చోటు సంపాదించుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో రెండు అర్ధశతకాలతో 206 పరుగులు చేశాడు ఇషాన్​. సగటు 41. టీమ్​ఇండియా తరఫున అత్యధిక పరుగులు అతడివే. ఈ క్రమంలోనే బ్యాటర్ల జాబితాలో ఒక స్థానం మెరుగుపరచుకొని 6వ ర్యాంకుకు చేరుకున్నాడు ఇషాన్.

ఇక ఐపీఎల్​ 15 నుంచి దుమ్ములేపుతున్న దినేశ్ కార్తీక్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​లోనూ పలు మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. బ్యాటర్ల జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్​ అజామ్.. అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టాప్​ 10లో టీమ్​ఇండియా నుంచి ఇషాన్ మాత్రమే ఉన్నాడు.

ఇక టీ20 బౌలర్ల జాబితాలో మూడు స్థానాలు మెరుగై 23వ ర్యాంకుకు చేరుకున్నాడు యుజ్వేంద్ర చాహల్​. జోష్ హేజిల్​వుడ్​ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఇక టెస్టు ఆల్​రౌండర్ల జాబితాలో 385 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్​ అల్​హసన్ రెండో స్థానానికి ఎగబాకాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో అశ్విన్, బుమ్రా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఇదీ చూడండి: రోహిత్​, కోహ్లీలకు బీసీసీఐ స్ట్రాంగ్​ వార్నింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.