ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jun 21, 2022, 2:59 PM IST

3PM TOP NWES

..

  • గ్రామ సచివాలయ ఉద్యోగల తీరుపై అసంతృప్తి.. చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్ !
    గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన ఓ వాలంటీర్.. తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డిలో చోటు చేసుకుంది. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు పంట బీమా ఇప్పించలేకపోయానంటూ వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై సచివాలయ ఉద్యోగులకు చెప్పినా.. పట్టించుకోవటం లేదని చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన ఎమ్మెల్యే !
    టీచర్ పోస్టుకు ఎంపికైన ఎమ్మెల్యే. అదేంటి.. ఎమ్మెల్యే టీచర్ పోస్టుకు ఎంపికవ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా ! అవునండీ.. మీరు విన్నది నిజమే. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో డీఎస్సీ రాసిన ధర్మశ్రీ ఇప్పుడు టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు
    మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులిచ్చారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 3గంటల 3నిమిషాల 33సెకండ్లు తలక్రిందులుగా యోగాసనం.. ప్రపంచరికార్డ్​
    Yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్​లోని చార్మినార్ ముందు తలక్రిందులుగా యోగా చేసి సోనూకుమార్ అనే యువకుడు నయా రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నిపథ్​పై తగ్గేదే లేదు.. ఆ విషయంలో మోదీకి సాటిలేరు'
    'అగ్నిపథ్'​పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ స్పందించారు. సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్​ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏకే-47 కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష- పదవి పోవడం ఖాయం!
    ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన పట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య? సాయంత్రం అధికారిక ప్రకటన??
    President elections 2022: రాష్ట్రపతి ఎన్నికల వేళ దిల్లీలోని వెంకయ్య నాయుడు నివాసం కీలక భేటీకి వేదికైంది. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వెంకయ్యతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 900 ప్లస్​.. కారణాలు ఇవే..
    భారీ లాభాల్లో:దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ముందుకు పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ ఏకంగా 950 పాయింట్లకుపైగా పెరిగి.. 52 వేల 560 ఎగువన కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో.. 15 వేల 650 వద్ద ఉంది. లాభాలకు కారణాలను ఓసారి చూస్తే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ranji Trophy: 42వ టైటిల్​ వేటలో ముంబయి.. మధ్యప్రదేశ్​ అడ్డుకునేనా?
    Ranji Trophy 2022 Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్ చివరకు చేరుకుంది. ఫైనల్​లో​ ముంబయి- మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్​ గెలుచుకున్న ముంబయి.. 42వ సారి ట్రోఫీని అందుకోవాలన్న పట్టుదలతో ఉండగా.. 23ఏళ్ల తర్వాత తుదిపోరుకు చేరుకున్న మధ్యప్రదేశ్​ ఎలాగైనా విజేతగా నిలవాలని ఊవిళ్లూరుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూటు మార్చిన స్టార్స్​.. సరికొత్త వెబ్​సిరీస్​ల​తో ప్రేక్షకుల ముందుకు!
    ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్​సిరీస్​ల​లో సాధరణ నటులే కాదు స్టార్​లు కూడా నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ఈ ఓటీటీ బాటలో అడుగులు వేయగా.. మరికొంతమంది తారలు కూడా ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా మెరవబోతున్నారు. త్వరలోనే వీరంతా పలు భిన్నకథలతో రూపొందుతున్న వెబ్​సిరీస్​లతో పలకరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details