ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఖర్చులకు పొంతన లేదు- అనుయాయులకు అక్రమ చెల్లింపులు : నీలాయపాలెం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 1:21 PM IST

state government debts and expenses are not matched : ప్రతి నెలా రూ.5-6వేల కోట్లు అప్పు చేసే జగన్​ జనవరిలో అదనంగా 2.5కోట్లు అప్పు చేసి అంతకు మించి ఖర్చు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, చేస్తున్న ఖర్చులకు పొంతన ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు. జనవరి నెలలో  రూ.8వేల కోట్లు అప్పు చేస్తే 10వేల కోట్ల ఖర్చు ఎలా జరిగిందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని విజయ్ కుమార్ నిలదీశారు. ఏ కాంట్రాక్టర్లు, అస్మదీయుల చెల్లింపుల కోసం ఈ ఖర్చు చేశారని ప్రశ్నించారు. 

జనవరిలో వడ్డీలు, సబ్సిడీలు, పెన్షన్లు, జీతాలు, తదితరాలు అలాగే ఉంటే రెవెన్యూ ఖర్చు 5 వేల కోట్ల నుంచి 10,368 కోట్లుకు ఎందుకు పెరిగిందని నీలాయపాలెం ప్రశ్నించారు. ప్రతి నెలా చేసే అప్పుల కంటే అదనంగా నాలుగు వేల కోట్ల అప్పులు చేసి నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు ఎందుకు చేశారని నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తమ అనుచరులు, తమ కంపెనీలు, తమ వాళ్లకి అప్పు తెచ్చి మరీ చెల్లింపులు చేసేశారని నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details