ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏడో తరగతి విద్యార్థినిపై స్వీపర్ లైంగిక దాడి - స్కూల్ బిల్డింగ్​పై దారుణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 1:44 PM IST

Sweeper_Raped_Seventh_Class_Girl

Sweeper Raped Seventh Class Girl: బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయసున్న విద్యార్థినిపై పాఠశాల పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలివీ బాపట్ల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని వసతి గృహంలో ఉంటూ పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడోతరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థినిని పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు స్కూల్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

ఈ దారుణ ఘటనపై సహచర విద్యార్థులు వసతి గృహం అధికారి, స్కూల్ హెడ్​మాస్టార్​కు తెలిపారు. హెచ్​ఎమ్​ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కుటుంబ సభ్యుల సమక్షంలో బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు సేకరించారు. ఈ ఘటనలో నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడి పై అత్యాచారం. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details