ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటీషన్- విచారణ వాయిదా - Tellam Rajya Lakshmi Caste Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 6:58 PM IST

High Court On Tellam Rajya Lakshmi Caste Case: తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ మాదంవారి గూడెేనికి చెందిన మడకం వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. బీసీ కులానికి చెందిన తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతూ తప్పుడు కుల ద్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ఇప్పటికే కలెక్టర్​కు పిటిషనర్ ఫిర్యాదు చేశారు.

పిటిషనర్ కంప్లైంట్​ను పరిగణలోకి తీసుకోకుండా తెల్లం రాజ్యలక్ష్మి ఎస్​టీ అంటూ బుట్టాయిగూడెం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ చట్టం ప్రకారం కలెక్టర్ మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలని పిటీషనర్ న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా తెల్లం రాజ్యలక్ష్మికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోలవరం నుంచి టికెట్ బరిలో దిగనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details