తెలంగాణ

telangana

ఆదాయం పెంచుకోవడంపై టీఎస్‌ఆర్టీసీ ఫోకస్ - రోజుకు కోటి పెరిగేలా కార్యాచరణ! - TSRTC on Revenue

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 10:55 AM IST

TSRTC focus on revenue increasing
TSRTC focus on revenue increasing

TSRTC Focus on Revenue Increasing : ప్రయాణికుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై టీఎస్‌ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సంస్థ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తద్వారా ప్రయాణికుల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా ఎంచుకుంది.

TSRTC Focus on Revenue Increasing : ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. వీటిలో ప్రయాణికుల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు, కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం మార్చిలో వేతన సవరణ చేసింది. పెరిగిన వేతనాలు జూన్‌ నుంచి అమల్లోకి రానున్నాయి.

Mahalakshmi Scheme in Telangana :ఈ వేతన సవరణతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ఏటా రూ.418 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని తట్టుకునేందుకు వీలుగా టికెట్‌ ఆదాయాన్ని రోజుకు రూ.కోటి పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఫలితంగా సంవత్సరానికి రూ.365 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది.

కార్గో లాజిస్టిక్స్​పై దృష్టి సారించిన టీఎస్​ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు

డిమాండ్‌ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులు! : ఆర్టీసీలో గరిష్ఠంగా రోజుకు 55 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఆక్యుపెన్సీ రేషియో- ఓఆర్‌) 95-120 శాతం వరకు నమోదవుతోంది. స్త్రీలకు ఉచితం లేని సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఏసీ బస్సుల్లో ఓఆర్ 65-70 శాతం వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో శాతం పెంచుకోగలిగితే ఆదాయం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

ఇందుకోసం రూట్ల వారీగా అదనపు ఆదాయానికి ఉన్న అవకాశాల్ని గుర్తించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) దృష్టి పెట్టింది. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఆగకుండా చూడటం, డిమాండ్‌ ఉన్న రూట్లలో డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్ని అధికంగా నడపడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌-శ్రీశైలం మధ్య గతంలో సూపర్‌లగ్జరీ బస్సులు మాత్రమే ఉండేవి. ఇటీవల ఏసీ బస్సుల్ని సంస్థ ప్రవేశపెట్టింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు కొత్త సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం పెరిగింది. ఇదే తరహా ప్రయోగాల్ని మరికొన్ని రూట్లలో చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

పార్శిల్ డెలివరీ ద్వారా రూ.125 ఆదాయార్జనే ఆర్టీసీ లక్ష్యం: ఎండీ సజ్జనార్

కండక్టర్లు, డ్రైవర్లతో సమావేశాలు :ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో వేతన సవరణ అదనపు భారాన్ని ఎలా భరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. సూపర్‌లగ్జరీ, ఏసీ, డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణికులను పెంచుకుంటే రోజుకు రూ.కోటి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) సూచించారు. ఈ దిశగా సమాయత్తం చేసేందుకు డిపోల వారీగా డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల కండక్టర్లు, డ్రైవర్లతో భేటీలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన - సగటున 29.67 లక్షల మంది ప్రయాణం - Mahalakshmi Scheme In Telangana

ఎండ నుంచి ఉపమశమనం- సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం - TSRTC

ABOUT THE AUTHOR

...view details