తెలంగాణ

telangana

రైతులకు గుడ్​ న్యూస్​ - కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు - Rythu Bharosa Scheme

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 8:32 AM IST

Telangana Govt on Farmers Schemes : రైతుభరోసా, పంటలబీమా, రుణమాఫీ పథకాల విధివిధానాలపై సర్కారు విస్తృత కసరత్తు చేస్తోంది. గత నెలలో కురిసిన అకాల వర్షాసరు దెబ్బతిన్న పంటల నష్టంపై అంచనాలను ప్రభుత్వం పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తర్వాత పరిహారం చెల్లించేందుకు సన్నాహకాలు చేస్తోంది. రాబోయే వానాకాలం సీజన్​ కోసం ఇప్పటి నుంచి రసాయన ఎరువులు, విత్తనాలు, ఇతర ఉపకరణాలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు చేస్తుంది.

Telangana Govt Working on Farmers Schemes
Telangana Govt Working on Farmers Schemes

రైతులకు గుడ్​ న్యూస్​ - రైతు భరోసా పథకం అమలుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

Telangana Govt on Farmers Schemes : రైతుభరోసా, పంటబీమా, రుణమాఫీ పథకాల అమలుపై రాష్ట్ర సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయా పథకాల అమలుకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై విస్తృత కసరత్తు చేస్తోంది. పంటరుణాల వసూలులో సానుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకులకు తెలిపింది.

రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించింది. ఈ అంశంపై హైదరాబాద్​లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పథకాల అమలు, విధివిధానాలు రూపకల్పన కసరత్తులు, ఎంత నిధులు అవసరమవుతాయి, పరిపాలన పరమైన అనుమతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఎన్నికల సంఘం అనుమతితో రాబోయే ఈ ఖరీఫ్ కాలానికి పంటల బీమా పథకం(Crop Insurance Scheme) అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతుభరోసా పథకం అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఈ ఏడాది యాసంగి పంటల కొనుగోళ్లు వేగంగా ప్రారంభమైన వేళ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. టీఎస్‌ మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా పొద్దుతిరుగుడు, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు సజావుగా సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి నాణ్యత ప్రమాణాల ప్రకారం మద్దతు ధర(Minimum Support Price for Grain) చెల్లించి కొనుగోలు చేయడానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. రైతు శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

2024 వానా కాలానికి సంబంధించిన విత్తన సరఫరా, రసాయన ఎరువుల నిల్వలలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతనెలలో కురిసిన వడగండ్ల వానలవల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి అంచనా పూర్తి అయిందని అన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ప్రభుత్వం పంటల పరిహారం విడుదల(Release of Crop Compensation) చేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు వ్యవసాయశాఖ విజ్ఞప్తి మేరకు ఈసీ అనుమతి రాగానే అవి రాయితీపై రైతులకు అందుబాటులో పెట్టనుంది.

రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు - మార్చి మొదటి వారంలోనే!

రైతులకు గుడ్​న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్

ABOUT THE AUTHOR

...view details