ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగడానికి నీళ్లు లేవు, గదుల్లో ఎలకలున్నాయి - ఒంగోలు ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:50 AM IST

Ongole IIIT Students Agitation: వసతుల కొరతతో ఒంగోలు ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు సతమతమవుతున్నారు. తాగడానికి కనీసం మంచినీళ్లైనా అందుబాటులో లేవని విద్యార్థులు వాపోతున్నారు. వసతి గృహల్లో దోమలు, ఎలుకల బెడద ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చివరకి రోడ్డెక్కారు.

ongole_iiit_students_agitation
ongole_iiit_students_agitation

తాగడానికి నీళ్లు లేవు, గదుల్లో ఎలకలున్నాయి - ఒంగోలు ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళన

Ongole IIIT Students Agitation:ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు తాండవిస్తున్నాయి. కళాశాల హాస్టళ్లు మురికి కూపాలుగా మారిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక హాస్టల్‌ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ట్రిపుల్‌ ఐటీ అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. అందులో ఒక దానిని రావు అండ్‌ నాయుడు ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దాంట్లో 1300మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనాలలో క్లాసులు నిర్వహిస్తున్న ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు. అలా అని పూర్తి స్థాయిలో వసతులు కల్పించటం లేదు.

ఫీజు పెంపు - ఇడుపులపాయ ట్రిపుల్ ​ఐటీ విద్యార్థుల ఆందోళన

ఇటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలలేమితో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇరుకైన గదుల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగాలేక అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా పగిలిపోయిన పైప్‌లైన్లు తుప్పు పట్టిన కుళాయిల్లో నీళ్లు రాక నరకం అనుభవిస్తున్నారు.

"స్టాఫ్​ని ఇటీవలే అసైన్డ్​ చేశారు. నియమించిన రెండు మూడు రోజుల్లోనే, రెండు మూడు చాప్ట్రర్ల సిలబస్​ పూర్తి చేస్తున్నారు. వరసగా మూడు నాలుగు గంటలు క్లాస్​ తీసుకుని సిలబస్​ పూర్తైంది అంటున్నారు." -ట్రిపుల్​ ఐటీ విద్యార్థిని

బీచ్‌లో స్నానానికి వెళ్లి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి

"కనీస వసతులేమి లేవు. కనీసం అవి కూడా లేకపోతే ఎలా. అడిగితే సమాధానాలు చెప్తున్నారు. అంతేతప్పా శాశ్వత పరిష్కారాలు చూడటం లేదు." - -ట్రిపుల్​ ఐటీ విద్యార్థి

పేరుకే ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా సౌకర్యాలు మాత్రం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్‌ గదుల్లో ఫ్యాన్లు సరిగాలేక దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఎలుకలు స్వైర విహారం చేస్తూ అనేక మందిని గాయపరుస్తున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు.

కరెంట్ స్తంభం ఎక్కిన కొండచిలువ - 'ట్రిపుల్ ఐటీలో మంచం కింద దాక్కుని'

సమస్యలపై తాము అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆవేదన చెందుతున్నారు. ఇలా అయితే తమ చదువులు సక్రమంగా సాగేదెలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. నేలపై బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థులు చేస్తున్న నిరసనకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని ట్రిపుల్‌ ఐటీ పాలన అధికారులను కోరారు.

"ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఎలా ఉన్నారు. వారి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేవి ఒక్కటి పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మంత్రులు పట్టించుకోవడం లేదు." దామచర్ల జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే

ఇడుపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం

ABOUT THE AUTHOR

...view details