ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యేల బదిలీలతోనే ఓటమిని ఒప్పుకున్నారు- దిల్లీలో కూడా బైబై జగన్ అంటున్నారు: నారా లోకేశ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 9:57 PM IST

Nara Lokesh Comments: సీఎం జగన్​ ఎమ్మెల్యేల బదిలీ చేసినప్పుడే ఓటమిని ఒప్పుకున్నారని నారా లోకేశ్​ అన్నారు. సొంత కార్యకర్తతో జగన్​ కోడికత్తితో దాడి చేయించుకుని ఆ నెపాన్ని తెలుగుదేశంపై నెట్టేయడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ అధోగతిపాల్జేశాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

nara_lokesh_comments
nara_lokesh_comments

Nara Lokesh Comments: జగన్‌ పని అయిపోయిందని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్ధలుకొట్టే బాధ్యత అందరిపై ఉందని లోకేశ్​ పేర్కొన్నారు. దిల్లీలో ఉన్న వైఎస్సార్​సీపీ ఎంపీలు కూడా జగన్‌కు బైబై అంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

లోకేశ్​ శంఖారావం యాత్ర శ్రీకాకుళం జిల్లాలో రెండవ రోజు కొనసాగింది. సోమవారం నిర్వహించిన ఈ యాత్రలో, ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్‌కు లోకేశ్​ దిశానిర్దేశం చేశారు. శంఖరావం సందర్భంగా నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలసలో నిర్వహించిన సభల్లో లోకేశ్ పాల్గొన్నారు. రేపు పాతపట్నం, పాలకొండ, కురుపాంలో శంఖారావం సభలను నిర్వహించనున్నారు.

వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే - చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం: నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెలుగుదేశం నేత కూన రవికుమార్ నేతృత్వంలో శంఖారావం సభ నిర్వహించగా లోకేశ్​ పాల్గొన్నారు. లోకేశ్​తో పాటు ఎంపీ రామ్మెహన్​, జిల్లాలోని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు ఈ సభకు భారీగా తరలివచ్చారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లోకేశ్​ కోరారు. స్థానిక మంత్రి ఇక్కడి రోడ్లపై గుంతలు పూడ్చే పరిస్థితిలో కూడా లేరని మండిపడ్డారు.

సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాల గురించి తెలుగుదేశం నేతలు ప్రజలకు వివరించాలని లోకేశ్​ పిలుపునిచ్చారు. పార్టీలో సీనియర్లను, జూనియర్లనూ గౌరవిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ప్రజల వద్దకు ఎంత ఎక్కువగా తిరిగితే కార్యకర్తలకు అంతగా అవకాశాలు వస్తాయని సూచించారు. రాబోయే 2 నెలలు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యకర్తల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు అందించినట్లు వివరించారు. చేయని తప్పుకు చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యకర్తలపై కేసులు,వేధింపులకు బదులు ఉంటుంది- పలాస శంఖారావం సభలో గౌతు శిరీష

అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు జగన్‌ సిద్ధంగా ఉన్నారా అని లోకేశ్​ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమో కాదో జగన్‌ చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, వైఎస్సార్​సీపీ హయాంలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని లోకేశ్​ ప్రశ్నించారు. చర్చకు తేదీ, సమయం మీరే చెప్పండని, చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వైఎస్సార్​సీపీ సిద్ధమా అని లోకేశ్​ సవాల్​ విసిరారు.

తాడేపల్లి గేట్లు బద్దలయ్యే రోజులు రాబోతున్నాయని లోకేశ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు పాదాభివందనాలని అన్నారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారని గుర్తు చేశారు. దిల్లీలో ఉన్న వైఎస్సార్​పీ ఎంపీలు కూడా జగన్‌కు బైబై అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 151 స్థానాల్లో గెలిచి జగన్‌ ఏం సాధించారని ప్రశ్నించారు.

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు- పరిశ్రమల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తాం: లోకేశ్​

ఐదేళ్లవుతున్నా ఇప్పటికీ సీపీఎస్‌ సమస్యే పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కొత్తగా ఎమ్మెల్యేల బదిలీల స్కీమ్‌ తెచ్చారని ఎద్దేవా చేశారు. ఒకచోట పనికిరాని చెత్త మరోచోట బంగారం అవుతుందా అంటూ లోకేశ్​ వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని నేతలు పక్క నియోజకవర్గంలో చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్‌ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేశ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సొంత కార్యకర్తతో జగన్‌ కోడికత్తితో దాడి చేయించుకున్నారని దుయ్యబట్టారు. కోడికత్తితో దాడి చేయించుకుని టీడీపీపై నెపం నెట్టాలని చూశారన్నారు. ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా దిల్లీలో ప్రశ్నించారా అని లోకేశ్​ నిలదీశారు. సొంత కేసుల మాఫీ కోసమే దిల్లీకి వెళ్లి వస్తున్నారని మండిపడ్డారు. ఇసుక ద్వారా రోజుకు 3 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్​ మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. విశాఖలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్‌ నిర్మించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌ : నారా లోకేశ్

తప్పుడు కేసులకు భయపడేది లేదని లోకేశ్​ స్పష్టం చేశారు. తనపై 22 కేసులు పెట్టారని, పాదయాత్రలో ఇబ్బంది పెట్టారని పేర్కోన్నారు. తన మైక్‌, స్టూల్‌ లాగేశారని, అయినా నేను వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన యువగళం పాదయాత్ర పూర్తిచేశానని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లకు చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తానని లోకేశ్​ హెచ్చరించారు. రాబోయేది టీడీపీ -జనసేన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు లేవని, ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని హామి ఇచ్చారు. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల రూపాయలు అందిస్తామని భరోసానిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్‌ యత్నిస్తున్నారని లోకేశ్​ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయబోమని లోకేశ్​ ప్రకటించారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు చేస్తుందని అన్నారు.

జగన్​ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు - నిరుద్యోగులకు లోకేశ్​ బహిరంగ లేఖ

ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జాలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని తెలిపారు. జే ట్యాక్స్‌ మొత్తం జగన్‌ జేబుల్లోకి వెళ్తోందన్నారు. మద్యం విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. మద్యం తయారీ, విక్రయాలన్నీ వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చెత్త పన్ను కూడా వేశారని, గాలికి కూడా పన్ను వేస్తారేమోనని అన్నారు.

నారా లోకేశ్​తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భేటీ - మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు

దిల్లిలోని వైఎస్సార్​సీపీ నేతలే జగన్​కు బైబై అంటున్నారు : నారా లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details