ETV Bharat / state

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు- పరిశ్రమల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తాం: లోకేశ్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 11:00 PM IST

Nara Lokesh Shankaravam Meeting: జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జోస్యం చెప్పారు. నిరుద్యోగ యువకులను సీఎం జగన్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం అంటేనే పోరాటాల గడ్డ అని లోకేశ్ పేర్కొన్నారు.

nara_lokesh_shankaravam_meeting
nara_lokesh_shankaravam_meeting

Nara Lokesh Shankaravam Meeting: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నేటి ప్రారంభించిన శంఖరావం యాత్ర ఉత్తరాంధ్రలో గర్జించింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలిలో జరిగిన బహిరంగ సభల్లో లోకేశ్, జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

శంఖరావం యాత్ర ద్వారా లోకేశ్​ యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజులపాటు పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేశ్​ యాత్రను ప్రారంభించారు.

ఉత్తరాంధ్రను తెలుగుదేశం జాబ్ క్యాపిటల్‌ ఆఫ్ ఇండియాగా మార్చిందని లోకేశ్​ గుర్తు చేశారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్‌గా మార్చిందని విమర్శించారు. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జాలు బాగా పెరిగాయని ఆరోపించారు. వారి వేధింపుల వల్లే అధికారుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యకర్తలపై కేసులు,వేధింపులకు బదులు ఉంటుంది- పలాస శంఖారావం సభలో గౌతు శిరీష

23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్‌ అన్నారని, అలాంటిది ఎన్నికల ముందు కేవలం 6 వేల పోస్టులతో డీఎస్సీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ వేసే బాధ్యత తనదని లోకేశ్​ హామి ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారని లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్‌ అని లోకేశ్​ మండిపడ్డారు. విశాఖ రాజధాని అంటున్న జగన్‌, విశాఖకు ఒక్క కంపెని అయినా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి పనులకు ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో మూతబడిన పంచదార పరిశ్రమలను తెరిపించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామని అన్నారు.

శంఖారావం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం: పత్తిపాటి పుల్లారావు

వంశధార, నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. పలాస నియోజకవర్గానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేశామని ప్రకటించారు. మంత్రి సీదిరి పలాస నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేశారా అని ప్రశ్నించారు. హెల్త్ వర్కర్‌, అంగన్వాడీ పోస్టులనూ ఇక్కడి మంత్రి అమ్ముకుంటున్నారని లోకేశ్​ మండిపడ్డారు. పలాస నియోజకవర్గంలో ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా అని నిలదీశారు. మంత్రి సీదిరి, కొండలరాజు అనే పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.

పలాస జీడిపిక్కల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర ఇచ్చి జీడిపిక్కల రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చిన ముూడేళ్లలోనే ఆఫ్‌ షోర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని పేర్కోన్నారు. పలాసలో ఆర్మీ కోచింగ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌ : నారా లోకేశ్

సెజ్ ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తామని హామి ఇచ్చారు. పలాసలో ఉపాధి లేక సిక్కోలు కార్మికులు దేశమంతా వలస వెళ్తున్నారని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి సిక్కోలు కార్మికులకు ఇక్కడే ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అప్పగిస్తామని హామినిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నట్లు గుర్తు చేశారు.

ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో రాశానని మరోసారి లోకేశ్​ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

జగన్​ అరాచకాలపై లోకేశ్ ఎక్కుపెట్టిన అస్త్రమే శంఖారావం : మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

శ్రీకాకుళం అంటేనే పోరాటాల గడ్డ అని లోకేశ్​ అన్నారు. జగన్‌ మరోసారి జైలుకు వెళ్లేందుకే సిద్ధం, సిద్ధం, అంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లాలో వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు బాగా పెరిగాయని వివరించారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు ఉన్నవారు పేదవాళ్లా అని లోకేశ్​ ప్రశ్నించారు. సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేశారని, తమకు భద్రత లేదని సొంత కుటుంబసభ్యులే అంటున్నారన్నారు.

సూపర్‌సిక్స్ పేరుతో మేనిఫేస్టోని తయారు చేసినట్లు తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామినిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామి ఇచ్చారు.

జగన్​ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు - నిరుద్యోగులకు లోకేశ్​ బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.