ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి "నిజం గెలవాలి" - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 2:15 PM IST

Updated : Jan 26, 2024, 2:49 PM IST

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినవారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగిస్తున్నారు.

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra

తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి "నిజం గెలవాలి" - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra :తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినవారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. ప్రతి కుటుంబాన్నీ కలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. తూర్పుగోదావరిజిల్లా నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగిస్తున్నారు. అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలులో ప్రసిద్ధిగాంచిన గోలింగేశ్వరస్వామి ఆలయాన్ని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు నారా భువనేశ్వరికి పూర్ణకుంభ స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయంలో స్వామివారికి నారాభువనేశ్వరి పట్టు వస్త్రాలు సమర్పించారు.

నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం

ధైర్యం నింపిన నారా భువనేశ్వరి : చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో గుండెపోటుతో మృతి చెందిన రొక్కల రాణి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగాబాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే విధంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరాహారదీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన పెద్ద సత్తియ్యను పరామర్శించి రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న భువనేశ్వరి ధైర్యం నింపారు. ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి పరామర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మానసికంగా ఆర్థికంగా కుంగిపోతున్న తమ కుటుంబానికి ధైర్యం చెప్పి నారా భువనేశ్వరి ఆదుకున్నారని వారు తెలిపారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన

కోనసీమ జిల్లాలో నిజం గెలివాలి : భువనేశ్వరి నిజం గెలవాలియాత్ర గురువారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సాగింది. అమలాపురంలో యాత్ర ప్రారంభించిన ఆమె మండపేట నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో పర్యటించారు. అయినవిల్లి మండలం ఎస్‌.మూలపొలంలో మీరాసాహెబ్‌ గుండెపోటుతో మృతి చెందగా ఆయన భార్య దుర్గ, తమ్ముడు బాలరాజును పరామర్శించారు. అల్లవరం మండలం రెల్లుగడ్డలో పార్టీ కార్యకర్త నడింపల్లి పల్లంరాజు కుటుంబాన్ని ఓదార్చారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన సలాది విశ్వనాథం భార్య ఆదిలక్ష్మి, కుమార్తెలు జీవనజ్యోతి, రత్నకుమారి, కాంతలక్ష్మిని ఓదార్చారు. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, మండపేట మండలం పాలతోడు, కపిలేశ్వరపురం మండలం నల్లూరులో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయమందించారు.

205 కి.మీ. ధ్వంసమైన రోడ్లపై సుదీర్ఘ ప్రయాణం :నారా భువనేశ్వరి జిల్లాలో గురువారం 205 కి.మీ మేర ప్రయాణం చేశారు. ధ్వంసమైన గుంతలతో అధ్వానంగా ఉన్న రహదారులపై ఆమె ప్రయాణం సాగింది. మార్గంమధ్యలో స్థానిక ప్రజలు ఆపినచోట వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ రహదారుల అభివృద్ధి గురించి చంద్రబాబుకు చెప్పాలని పలువురు ఆమెను కోరారు. నారా భువనేశ్వరికి గ్రామాల్లో ప్రజలు పూలుజల్లుతూ స్వాగతం పలికారు.

కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ

Last Updated : Jan 26, 2024, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details