ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 6:59 PM IST

thumbnail

Nara Bhuvaneswari Nijam Gelavali Tour: నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. రేపు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ నగరాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈనెల 25న పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 26న అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.  

 స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను  పరామర్శించడానికి నారా భువనేశ్వరి  'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. గతేడాది అక్టోబర్‌లో "నిజం గెలవాలి" కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించిన భువనేశ్వరి చంద్రబాబు బెయిల్‌ పై విడుదలయిన అనంతరం తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్లీ  'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు అరెస్ట్​తో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేస్తూ, వారి తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.