Man Caused Six Road Accidents in Hyderabad :ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లోని ఐకియా నుంచి ప్రారంభించి వరుసగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు(Road Accidents in Hyderabad) చేశాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఈ వరుస ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నగరంలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్ యాదవ్ ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయలుదేరి ఐకియా రోటరీ వద్దకు చేరుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ఆ కారు ధ్వంసమైంది. అందులోని ఒక మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆ కారును ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోతూ ఉండగా గచ్చిబౌలి బాబూఖాన్ లేన్ దగ్గర ఒక బైక్‌ను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఒకరికి కాలు విరిగిపోగా, ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం - మంటలు చెలరేగి కారు దగ్ధం - ఇద్దరు యువకులకు గాయాలు
పూటుగా మద్యం తాగి :నిందితుడు మరింత వేగంగా కారును నడుపుతూ పిస్తా హౌజ్ ఎదురుగా వెళ్తూ 20-25 ఏళ్ల యువకుడిని ఢీకొట్టాడు. అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ అతని వివరాలు ఏవీ బయటకు రాలేదు.