ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మా భూములకు రక్షణ లేకుండా పోతుంది- ప్రజల హక్కులకు భంగం : రైతులు - Land Titling act People Problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 4:50 PM IST

Land Titling act People Problems : వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండాఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు.

land_titling_act_people_problems
land_titling_act_people_problems

Land Titling act People Problems :వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండా ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు. భూ హక్కు చట్టం అమలోకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోతామంటున్న రైతులతో ఈటీవీ ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి.

భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2022!

ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారని, ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఈ చట్టం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయంటున్న ఇధికారులు. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారని దీని వల్ల ఊరట పొందొచ్చని ప్రభుత్వ ప్రజల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది.

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం (యాక్ట్‌ 27/2023) విషయంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం విషయంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ప్రజా ప్రయోజనానికి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసింది. అంతేకాక ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున హైకోర్టులో వ్యాజ్యం వేయాలని తీర్మానించింది.

భూయజమానుల హక్కుల్ని హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ - రాష్ట్రంలో దుమారం - Land Titling Act in Andhra Pradesh

భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు సైతం డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తోందని వెంటనే జీవో 512ను రద్దు చేయాలంటూ ఆందోళను చేపడుతున్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చెందారు.

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం: బార్ కౌన్సిల్

ABOUT THE AUTHOR

...view details