ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం: బార్ కౌన్సిల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 8:27 AM IST

thumbnail

Andhra Pradesh Bar Council Decision on AP Land Titling Act : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం (యాక్ట్‌ 27/2023) విషయంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం విషయంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ప్రజా ప్రయోజనానికి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసింది. అంతేకాక ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున హైకోర్టులో (High Court) వ్యాజ్యం వేయాలని తీర్మానించింది. 

 AP Land Titling Act 2023 Updates : టైటిలింగ్‌ చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని వివిధ బార్‌ అసోసియేషన్ల న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించకుండా నిరసన తెలిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఏపీ టైటిలింట్‌ చట్టంపై చర్చించేందుకు ఈ నెల 10న ఏపీ బార్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ తీర్మానాలు చేసిందని పేర్కొంటూ ఛైర్మన్‌ గంటా రామారావు (Ganta Rama Rao) పత్రిక ప్రకటన జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.