ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమూల్‌ సంస్థకు అన్నీ తానై - పాడి రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్​ - Jagan spoiled Dairy Development

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 2:22 PM IST

Jagan spoiled Dairy Development in Andhra Pradesh : పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్‌ పాడిని పాడు చేశారు. పాల సేకరణలో అమూల్‌ సంస్థకు అన్నీ తానై సమకూర్చి పెట్టిన ఆయన పాడి రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు.

jagan_spoiled_dairy_development_in_andhra_pradesh
jagan_spoiled_dairy_development_in_andhra_pradesh

Jagan spoiled Dairy Development in Andhra Pradesh : పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్‌ పాడిని పాడు చేశారు. పాల సేకరణలో అమూల్‌ సంస్థకు అన్నీ తానై సమకూర్చి పెట్టిన ఆయన పాడి రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పాడి పథకాలన్నీ పక్కన పెట్టేశారు. పశువులకు నీడనిచ్చే గోకులం పథకాన్ని మొత్తంగా చాప చుట్టేశారు. పశుగ్రాస క్షేత్రాలకు ఉపాధి హామీ నిధుల కేటాయింపును ఎండగట్టారు. రాయితీపై అందించే పాతర గడ్డిని పీకి పడేశారు. పశుబీమా ప్రీమియం భారాన్ని అన్నదాతల నెత్తినే మోపారు.

నీడ లేకుండా చేశారు :పశువులను అపరిశుభ్రత ప్రాంతంలో కట్టి ఉంచడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతాయి. పాములు, ఇతర విష జంతువుల బారిన పడుతుంటాయి. పశువుల సంరక్షణలో మెరుగైన పద్ధతులు పాటించేలా గత ప్రభుత్వం గోకులం, మినీ గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణం చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో 4,950 గోకులాలు నిర్మించారు. వీటికి సంబంధించి సుమారు రూ. 30 కోట్ల బిల్లులు ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువు తీరాక ఈ గోకులాలను పూర్తిగా పక్కన పెట్టేసి, పశువులకు నీడ లేకుండా చేసింది. ఫలితంగా మూగజీవాలు వ్యాధుల బారిన పడి పాల ఉత్పత్తి తగ్గిపోతోంది.

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy

పశుగ్రాస క్షేత్రాలు మాయం :గత ప్రభుత్వ హయాంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పేరిట రైతులతో మేలురకం గడ్డిని పెంచేవారు. ఉపాధి హామీ ద్వారా గడ్డి పెంపకానికి అవసరమైన నిధులను సాయం చేసేవారు. జిల్లాలో వెయ్యి హెక్టార్ల వరకు పశుగ్రాస క్షేత్రాలుండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం నుంచి పశుగ్రాస పెంపకాన్ని తప్పించారు. నిధులను నిలిపేశారు. రైతులకు ఈ గ్రాసం పెంచడం భారంగా మారడంతో చాలామంది వీటి పెంపకాన్ని విరమించుకున్నారు. నాణ్యమైన పశుగ్రాసం స్థానంలో ఎండుగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడం లేదని రైతులంటున్నారు.

రాయితీకి పాతరేశారు :గతంలో పాతర గడ్డిని (సైలేజ్‌) కిలో రూ.2 చొప్పున రాయితీపై రైతులకు అందజేసేవారు. ఈ గడ్డిలో పోషకాలు ఎక్కువగా ఉండడంతో పాల ఉత్పత్తి పెరగడానికి దోహదపడేది. పశువులు కూడా ఈ గడ్డిని తినడానికి ఇష్టపడేవి. ఈ ప్రభుత్వం వచ్చాక మొదట్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై అందించేవారు. కొన్నాళ్లు తర్వాత ఈ గడ్డి సరఫరాను నిలిపేశారు. ఇప్పుడు కొన్ని పాలసేకరణ కేంద్రాలు కిలో రూ. 5 నుంచి రూ. 8 చొప్పున రైతులకు విక్రయిస్తున్నాయి. అంత మొత్తం భరించలేని రైతులు వాటి స్థానంలో ఇతర దాణాలు వాడుతున్నారు.

అమూల్​పై ఎనలేని ప్రేమ - కోట్ల విలువైన సహకార డెయిరీలు అప్పగింత

ప్రీమియం భారం పరిహారం దూరం : మొదట్లో రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే పాడి పశువులకు బీమా పరిహారం అందజేసేవారు. రెండేళ్ల క్రితం ఈ పథకంలో మార్పులు తెచ్చి పాడి రైతులపై ప్రీమియం భారం మోపారు. ప్రభుత్వం 80 శాతం చెల్లిస్తే, రైతులు 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీంతో సన్న, చిన్నకారు రైతులు ఒక్కో పాడి పశువుపై రూ. 192 నుంచి రూ. 384 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పెద్ద రైతులైతే ఆ భారం రూ. 480 నుంచి రూ. 960 వరకు ఉంటోంది. గొర్రెలు, మేకల పెంపకందారులపైనే ప్రీమియం భారం మోపడంతో చాలామంది బీమా చేయించుకోలేకపోతున్నారు. గత ఏడాది కాలంగా రైతులకు బీమా పరిహారం చెల్లింపుల్లోనూ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ. 2 కోట్లకు పైగా రైతులకు పరిహారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అంటూ పథకానికి కూడా బ్రేక్‌ వేశారు. ఇప్పుడు పశువులు చనిపోయినా పరిహారం అందే పరిస్థితి లేదు.

టీడీపీ హయాంలో మేలుజాతి పాడిపశువుల కొనుగోలు రుణాలిచ్చేవారు. హరియాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి మేలుజాతి పశువులను కొనుగోలు చేసి రైతులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతులే అప్పులు చేసి సొంతంగా పాడి పశువులను కొనుగోలు చేసుకుంటున్నారు. దీనివల్ల వారిపై అధికంగా భారం పడుతోంది. చేసిన అప్పులను తీర్చలేక కుదేలవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పశుసంపద ఆధారిత కుటుంబాలు: 5.64 లక్షలు

గేదెలు : 5.30 లక్షలు

ఆవులు : 6 లక్షలు

రోజువారీ పాల ఉత్పత్తి : 10 లక్షల లీటర్లు

CM Jagan Cheating Dairy Farmers: అమూల్​ని అందలం ఎక్కించారు.. మరి రైతులకు ఇస్తామన్న బోనస్ ఏది జగనన్నా..?

ABOUT THE AUTHOR

...view details