ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కూటమి గెలుపే లక్ష్యం - పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్న నేతలు - Alliance election campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 7:45 PM IST

Alliance Election Campaign in Various Districts: ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రచార దూకుడు పెంచారు. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ నేతలు అసంతృప్తి నేతల్ని కలుపుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో నష్టపోయిన బాధితులను కూటమి అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.

Alliance_Election_Campaign_in_Various_Districts
Alliance_Election_Campaign_in_Various_Districts

కూటమి గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్న నేతలు

Alliance Election Campaign in Various Districts:ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గుంటూరులో టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తూర్పు అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన ప్రజలు, క్రీడా సంఘాల నాయకులతో మాట్లాడారు. లాలాపేట సెంటర్​లో పండ్ల దుకాణాల యజమానుల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే పండ్ల మార్కెట్‌ కోసం కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

"ప్రభుత్వం వ్యాయామ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తోందని వ్యాయామానికి ప్రత్యామ్నాయం చూపించి బీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలి." -పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి

బీఆర్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతాం- గుంటూరులో పెమ్మసాని పర్యటన - pemmasani chandra sekhar

Bapatla Election Campaign: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారానికిశ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ఆరు గ్యారంటీలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తిరుపతి లోక్​సభ, శాసనసభ సీట్లను గెలిచి కూటమికి కానుకగా అందిస్తాం: టీడీపీ నేతలు - TDP Leaders Meeting At Tirupati

Nandhyala TDP Leaders Meeting in Party Office: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డోన్ అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ సుబ్బారెడ్డి, బనగానపల్లె అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని గద్దె దించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Janasena Anakapalli Candidate Konathala Ramakrishna: ప్రపంచంలోనే మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్​గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అనకాపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. అనకాపల్లిలోని 81 వ వార్డులో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి - ఓటు వేయాలని అభ్యర్థన - TDP Candidates ELECTION Campaign

ABOUT THE AUTHOR

...view details