KTR Tweet on Manickam Tagore :కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణికం ఠాగూర్‌పై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై ఎక్స్(Twitter) వేదికగా కేటీఆర్ రీట్వీట్ చేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో మాణికం ఠాగూర్ ఉన్నారని, తప్పుడు అడ్రస్‌కు పంపినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలి : కేటీఆర్
మాణికం ఠాగూర్ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాటలను తాను గుర్తు చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని తెలిపారు. అయితే జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు గానూ నోటీసులు పంపినట్లు మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
KTR Counter to Manickam Tagore : కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని, కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీరు పంపేపరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి(Minister Komatireddy Venkat Reddy) పంపిస్తే బాగుంటుందన్నారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు.