తెలంగాణ

telangana

కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే! - Old Vs New Tax Regime for TDS

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 10:18 AM IST

Old Vs New Tax Regime for TDS on salary
Old Vs New Tax Regime for TDS on salary

Old Vs New Tax Regime for TDS on salary : కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు తాము ఏ పన్ను విధానంలో కొనసాగులనుకుంటున్నారో కంపెనీకి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు అనువైన పన్ను విధానం ఎంచుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానంలో ఏది మంచిదో తెలుసుకుందాం.

Old Vs New Tax Regime for TDS on salary : కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయడం షురూ అవుతుంది. దీంతోపాటు ప్రస్తుత సంవత్సరంలో పన్ను భారం పడకుండా చేసుకోవడం కూడా ట్యాక్స్ ప్లేయర్ల బాధ్యతే. ఒకప్పుడు ఏప్రిల్ నెల వస్తే ఆదాయపు పన్ను మినహాయింపుల గురించే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు రెండు రకాల పన్నుల విధానాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది కూడా ముఖ్యమే. ఈ ఆర్థిక ఏడాది 2024-25కు సంబంధించి ఏ పన్ను విధానంలో కొనసాగాలో నిర్ణయించుకునే పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి తెలపాలి. మీరు ఎంచుకునేదాన్ని బట్టి టీడీఎస్ కట్ అవుతుంది. అయితే పన్ను విధానం ఎంచుకునే విధానం ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, కొత్త పన్ను విధానం డిఫాల్ట్​గా ఉంటుంది. ఉద్యోగి తాము ఏ పన్ను విధానంలో ఉండాలనుకుంటున్నారో తెలియజేయకుంటే కొత్త పన్ను విధానం అమలు అవుతుంది. దాని ప్రకారమే వేతనంలో టీడీఎస్​ను కంపెనీ కట్ చేస్తుంది. ఒకవేళ ఉద్యోగులు మినహాయింపులు చూపించాలనుకుంటే కంపెనీకి ఆ విషయాలను వెల్లడించాలి. అందుకోసం ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడులను ఎంచుకోవాలి. ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలోనే ఆ పెట్టుబడులను ప్రారంభిస్తే టీడీఎస్ కోతలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో ఉంటే ఎలాంటి పన్ను మినహాయింపులు వర్తించవన్న విషయం గుర్తుంచుకోవాలి.

కాగా కొత్త పన్ను విధానంలో అయితే రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, వేతనం ద్వారా పొందే ఆదాయంలో రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. ఒక వేళ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షల్లోపు ఉన్నట్లయితే. ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు. పాత పన్ను విధానంలో ప్రాథమికంగా రూ.2.5 లక్షల వరకు పన్ను ఉండదు. వేతనం ద్వారా వచ్చే ఆదాయంపై రూ.50 వేల ప్రామాణిక తగ్గింపు ఉంటుంది. సెక్షన్ 80సీ ద్వారా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అలాగే సెక్షన్ 80డీ ఆరోగ్య బీమా, సెక్షన్ 80సీసీడీ నేషనల్ పెన్షన్ సిస్టమ్, వంటి వాటి ద్వారా మినహాయింపుకూడా ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలు మించకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు.

కొత్త, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు వేతన జీవులు తమ ఆదాయాన్ని ముందుగానే లెక్కించుకోవాలి. ఈ ఆర్థిక ఏడాదిలో ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుని, అందులో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కించాలి. ఆ తర్వాత ట్యాక్స్ శ్లాబుల ఆధారంగా ఏ విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసుకోవాలి. దాని ద్వారానే పన్ను విధానంపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఒక వేళ ఆదాయపు పన్ను గురించి అవగాహన లేనట్లయితే ఆన్‌లైన్​లో అందుబాటులో ఉండే ట్యాక్స్ కాలిక్యులేటర్లను కూడా వినియోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు ఏ పన్ను విధానం అనేది ఎంచుకోకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ సమయంలోనూ మీకు నచ్చిన ట్యాక్స్ రెజిమ్ ఎంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details