Telangana RTC Special Buses for Women : టీఎస్​ఆర్టీసీ మరో గుడ్​న్యూస్.. ఆ రూట్​లో మహిళల కోసం ప్రత్యేక బస్సు

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 4:56 PM IST

thumbnail

Telangana RTC Special Buses for Women : హైదరాబాద్‌లో టీఎస్​ఆర్టీసీ నడుపుతున్న మహిళా ప్రత్యేక బస్సులకు(TSRTC Special Buses for Women) విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ మహిళల సౌకర్యార్థం మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు రూట్​లలో ఈ బస్సులు తమ సేవలను అందిస్తుండగా.. ఇవాళ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌ వరకు మరో బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సు ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు బయలు దేరి.. తిరిగి సాయంత్రం 4.10 గంటలకు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రానునట్లు ఆర్టీసీ అధికారులు( TSRTC Officials) తెలిపారు. 

RTC Special Buses for Women in Telangana : రద్దీగా ఉండే రూట్​లలో మహిళల ప్రయాణం సాఫీగా సాగటానికి.. సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోటానికి వీలుగా ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మహిళలకు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేయటం ద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని, మరిన్ని బస్సులు వేసి.. సమయాలను పెంచితే బాగుంటుందని మహిళా ప్రయాణికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.