thumbnail

జీవితం వన్​వే ట్రాఫిక్ అంటూ పిల్లలకు రాష్ట్రపతి పాఠాలు

By

Published : Nov 14, 2022, 5:50 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముచ్చటించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులతో ఆమె మమేకమయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. జీవితం వన్​వే ట్రాఫిక్​ లాంటిదని ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు ముర్ము. ఎటువంటి సౌకర్యాలు లేకుండానే తన విద్యాభ్యాసం సాగిందని ఆమె విద్యార్థులకు తెలిపారు. అలాగే తాను ఉపాధ్యాయురాలిగానూ పనిచేశానని ముర్ము అన్నారు. మీకు ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారని ఓ విద్యార్థిని రాష్ట్రపతి అడిగారు. అందుకు సమాధానంగా ఆ విద్యార్థి చెడుకు వ్యతిరేకంగా నిలబడతానని అన్నాడు. దేశానికి మేలు చేసే పనులు చేస్తానని చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.