Madhapur Buildings Demolition Viral Video : మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్థుల భవనాలు.. వీడియో వైరల్

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 4:42 PM IST

Updated : Sep 23, 2023, 5:26 PM IST

thumbnail

Madhapur Buildings Demolition Viral Video : హైదరాబాద్‌ మాదాపూర్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని బ్లాక్‌ 7, 8 భవనాలను అధికారులు క్షణాల్లో నేలమట్టం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దుమ్ము-ధూళి అలుముకుంది. భవనాల కూల్చివేత పనులను ఎడిపిక్ ఇంజినీరింగ్‌ సంస్థ పర్యవేక్షించింది.

రహేజా మైండ్‌ స్పేస్‌లోని 7, 8 బ్లాక్‌లలో నాలుగంతస్థుల బిల్డింగ్‌లు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు ఆ భవన యజమానులు టీఎస్‌ఐఐసీ నుంచి అనుమతులు తీసుకుని రెండింటినీ కూల్చి వేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. రెండు బిల్డింగ్‌లను చూస్తుండగానే నేలమట్టం చేశారు. పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉండగా.. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పాత భవనాలను పేక మేడల్లా కుప్పకూల్చారు. పాత భవనాలు కావడంతో.. ఈ రెండు భవనాలు కూల్చి వేసి.. అదే ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడానికి యజమానులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Last Updated : Sep 23, 2023, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.