మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి : మంత్రి కేటీఆర్​

By ETV Bharat Telangana Desk

Published : Nov 10, 2023, 6:25 PM IST

thumbnail

KTR Reaction on Congress BC Declaration : కాంగ్రెస్​ మైనారిటీ డిక్లరేషన్​ లోపభూయిష్టంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్​.. బీజేపీ స్ఫూర్తితో మైనారిటీ డిక్లరేషన్​ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్​, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ గతంలోనూ ఇలా చాలా సార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని(KTR Comments on Congress) విమర్శించారు. 

KTR Comments on BJP : కాంగ్రెస్​ బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందని కేటీఆర్​ పేర్కొన్నారు. 2004- 2014 మధ్య కాంగ్రెస్​ మైనారిటీలకు ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్​ఎస్​ మైనారిటీల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్​ డిక్లరేషన్​ చెబుతోందని.. ఇది ఒక కుట్ర అని ధ్వజమొత్తారు. ఈ డిక్లరేషన్​ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గజ్వేల్​లో కేసీఆర్​పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్​, కామారెడ్డిలో రేవంత్​రెడ్డి ఇద్దరూ ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.