BJP MP Aravind Fires on KCR Family : 'అవినీతి సొమ్మును రికవరీ చేసి మీ ముందు ఉంచుతాం'

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 3:42 PM IST

thumbnail

BJP MP Aravind Fires on KCR Family : రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. డిసెంబర్‌ మొదటి వారంలో అధికారం చేజిక్కించుకుంటుందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. జగిత్యాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సొమ్మును కొల్లగొట్టిన ఎమ్మెల్సీ కవిత తిహాడ్ జైలుకు వెళ్లడం పక్కా అన్నారు. కొల్లగొట్టిన సొమ్మును రికవరీ చేసి మీ ముందు ఉంచుతామన్నారు.. బీజేపీ అధికారంలోకి వస్తే చక్కర రైతుల కోసం ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

Nizamabad MP Aravind Fires on Kavitha : తెలంగాణను కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు మోసం చేస్తే... బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు మోసం చేసిందని అర్వింద్‌ దుయ్యబట్టారు. మేనిఫెస్టో పేరిట సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు. గల్ఫ్ సోదరుల అంశం కనీసం చర్చిందలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పుతారన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతే కల్వకుంట్ల ఫ్యామిలీలోని నలుగురు నాలుగు దిక్కులకు పోతారన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ సర్కారు రావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.