రోడ్డు ప్రమాదానికి కారణమైన శునకం- మృతుడి ఇంటికి వెళ్లి ఓదార్పు!

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 1:57 PM IST

thumbnail

A Dog Came To The House Of A Dead Person : సాధారణంగా ఎవరైనా చనిపోతే మనషులు వారింటికి వెళ్లి పరామర్శించడాన్ని చూస్తుంటాం. కానీ దీనికి భిన్నంగా ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చే విధంగా ఓ శునకం ప్రవర్తించింది. ఈ అరుదైన ఘటన కర్ణాటకలో జరిగింది.

మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. నవంబర్ 16న తిప్పేశ్ అనే యువకుడు తన సోదరితో హొన్నాళి తాలుకా క్యాసినకెరె గ్రామం నుంచి వెళ్లారు. తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా అతని బైక్​కు శునకం అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తిప్పేశ్ మృతి చెందాడు. మూడు రోజుల తర్వాత ప్రమాదానికి కారణమైన శునకం తిప్పేశ్ ఇంటికి వెళ్లింది. వంట గది, తిప్పేశ్ గది చుట్టూ తిరిగింది. మృతుడి తల్లి పక్కన కూర్చుని తోక ఊపుతూ ఓదార్చుతున్నట్లు ప్రవర్తించింది. శునకం ప్రవర్తనన చూసి తిప్పేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు.  

వానరం అంత్యక్రియలకు హాజరైన తోటి కోతులు  
మనుషులకే కాదు వానరాలకు మానవత్వం ఉంటుందని కొన్ని కోతులు నిరూపించాయి. చనిపోయిన తమ తోటి వానరం అంత్యక్రియలకు గుంపుగా హాజరయ్యాయి. ఈ అరుదైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​.. కోటా ప్రాంతంలో జరిగింది.   

ఇంతకీ ఏం జరిగిందంటే?
బిలాస్​పుర్​లోని కోటా పోలీస్​ఠాణా పరిధిలోని పోస్టాపీస్​కు సమీపంలోని న్యూ జయా ఎంటర్​ప్రైజెస్​ ముందు ఉన్న హైఓల్టేజీ వైర్​లో వానరం చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ వానరానికి కరెంట్​ షాక్ తగిలి మృతి చెందింది. ఓ హైందవ సంస్థకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ సంస్థ సభ్యులు వచ్చి కోతి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘటన జరిగింది. అంత్యక్రియల సమయంలో ఓ వానరం తమ తోటి కోతి చనిపోయిన స్థితిలో చూసిన వెంటనే మిగిలిన వాటికి తెలియజేసేందుకు వెళ్లింది. దీంతో తోటి వానరానికి వీడ్కోలు చెప్పేందుకు అక్కడకు వందలాది కోతులు వచ్చాయి. ఈ అరుదైన ఘటనను చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. ఇలాంటి స్నేహన్ని మొదటి సారిగా చూశామని ఆ హైందవ సంస్థ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.