ETV Bharat / sukhibhava

How To Increase Sexual Feelings : సెక్స్ లైఫ్​ డల్​గా ఉందా?.. ఈ చిట్కాల‌తో మీ లైంగిక ఆసక్తి డబుల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 7:56 AM IST

how to increase sexual stamina
How To Increase Sexual Feelings

How To Increase Sexual Feelings In Telugu : కొంత మందికి శృంగారంపై మొద‌ట్లో ఉన్నంత ఆసక్తి త‌ర్వాతి కాలంలో ఉండ‌దు. క్ర‌మంగా వారిలో లైంగిక ప‌ర‌మైన కోరిక‌లు త‌గ్గుతాయి. ఫ‌లితంగా దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం పెరుగుతుంది. అందుకే సెక్స్ లైఫ్ డ‌ల్ కావడానికి గ‌ల కార‌ణాలు, ప‌రిష్కార మార్గాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

How To Increase Sexual Feelings : వివాహ‌మైన ప్రారంభంలో శృంగారంపై ఉన్న ఆసక్తి తర్వాత కాలంలో ఉండ‌దు. కాలం గ‌డిచే కొద్దీ క్ర‌మంగా లైంగిక ప‌ర‌మైన కోరిక‌లు త‌గ్గి.. సెక్స్ లైఫ్ డ‌ల్ అవుతుంది. దీంతో దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగే అవ‌కాశ‌ముంది. అందుకే సెక్స్ లైఫ్ డ‌ల్ కావ‌డానికి గల కార‌ణాలు ఏమిటి? మ‌ళ్లీ శృంగారంపై ఆసక్తి, ప్రేర‌ణ ఏ విధంగా పొందాలి ? అనే విష‌యాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Reasons For Sex Drive Loss : సెక్స్ లైఫ్ డ‌ల్ కావ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణం.. విసుగు రావ‌డం. మ‌న వృత్తి రీత్యా, బాధ్య‌త‌ల రీత్యా మ‌న‌కు తెలియ‌కుండానే మనపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వ‌ల్ల చిరాకు, విసుగు, ఒకరకమైన డిప్రెష‌న్‌ కలుగుతాయి. ఇవి నేరుగా శృంగార జీవితంపై ప్రభావం చూపుతాయి. దీనితో శృంగారంపై ఆసక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. మీ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ బాధ్యతల నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాలి. అంటే.. మీ బిజీ బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని.. భార్యాభర్తలు ఇద్దరూ విహారయాత్రకు వెళ్లాలి. అందమైన ప్రదేశాలను సందర్శించాలి. ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరినిఒకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమ, అభిమానం, అప్యాయత పెరుగుతాయి. ఫలితంగా శృంగారంపై కూడా ఆసక్తి పెరుగుతుంది.

How To Increase Sexual Desire : వాస్తవానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. దీని వల్ల శృంగారంపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఒక వేళ మీకు అంత సమయం లేకపోతే.. రోజూ ప‌నులు పూర్త‌య్యాక స‌ర‌దాగా వాకింగ్ అయినా చేయాలి. కచ్చితంగా వీలు దొరికినప్పుడల్లా కుటుంబ స‌భ్యుల‌తో కలిసి సరదాగా విహార యాత్ర‌కు వెళ్లాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. మీ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుంటే ఆటోమేటిక్​గా మీ డల్​నెస్​ పోయి.. శృంగార ఆసక్తి పెరుగుతుంది.

యాంత్రికంగా వద్దు : చాలా మంది 'ఏదో చేయాలి కనుక.. తప్పదు కనుక' అనే ఆలోచనలో యాంత్రికంగా సెక్స్​లో పాల్గొంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. మీ జీవిత భాగ‌స్వామితో మ‌న‌ఃస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొనాలి. అప్పుడే సెక్స్ అనంత‌రం ఫీల్​గుడ్ హార్మోన్లు విడుద‌లై మీకు ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఎక్కువ సార్లు సెక్స్​ చేస్తే.. కండ‌రాలు క్షీణిస్తాయా ?
Do The Muscles Get Weak with Over Sex? : చాలా మంది ఎక్కువ సార్లు సెక్స్​ చేస్తే శక్తి క్షీణిస్తుందని, కండ‌రాలు వదులవుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్ర‌మే. వాస్తవానికి సరైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వ‌ల్ల కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌తాయి. అదే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి సమతుల ఆహారాన్ని తీసుకుంటే.. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. అంతేకానీ ఎక్కువ‌సార్లు శృంగారం చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు క్షీణిస్తాయని అనుకోవ‌డం పొర‌పాటు.

వీర్యం కోల్పోతే శక్తి నశిస్తుందని, కండ‌రాలు క్షీణిస్తాయ‌ని మరికొంత మంది అనుకుంటారు. ఇది కూడా అపోహ మాత్ర‌మే. వీర్యం అనేది ఎప్ప‌టి కప్పుడు మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అవుతుంది. కనుక వీర్యం పోతే శక్తి పోవడం, కండరాలు క్షీణించడం అనేది జరగదు. వాస్తవం చెప్పాలంటే.. వీర్యానికి, కండ‌రాల శక్తికి ఎలాంటి సంబంధం లేదు. స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం, రెగ్యుల‌ర్​గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు బ‌ల‌ప‌డి దృఢంగా మార‌తాయి. అయితే జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌పుష్టి రాదు అనే విషయం గుర్తించుకోవాలి.

సెక్స్ లైఫ్​ డల్​గా ఉందా?.. ప్రేరణ పొందండిలా!

Salty Food Health Problems : ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా?.. మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్లే!

Sitting Too Much Side Effects : కదలకుండా అదే పనిగా కూర్చుంటున్నారా? ఆ ఆరోగ్య సమస్యలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.